Tulsi Tips: తులసీ వద్ద పొరపాటున ఈ వస్తువులు ఉంచరాదు.. జీవితం నరకప్రాయమే

These Things Don't Kept At Tulsi Plant: హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఈ మొక్కను పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ మొక్క వద్ద కొన్ని వస్తువులు అస్సలు ఉంచకూడదు.

1 /9

లక్ష్మీదేవి: హిందూమతంలో తులసి మొక్కకు దేవుడి స్థానం అవకాశం ఉంది. తులసి మొక్కలో లక్ష్మీదేవిని కొలుస్తారు.

2 /9

తులసి మొక్క వద్ద కొన్ని వస్తువులను ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు.

3 /9

వినాయకుడు: ఇతిహాసాల ప్రకారం వినాయకుడు, తులసి కలిసి ఉండరు. వారి శత్రుత్వం కారణంగా తులసి దగ్గర వినాయకుడి బొమ్మ, విగ్రహం ఉంచకూడదు.

4 /9

చీపురు, చెత్త డబ్బా: తులసి మొక్క దగ్గర ఎప్పుడూ చెత్త డబ్బా (డస్ట్‌బిన్) ఉంచవద్దు. అంతేకాకుండా చీపురు కూడా పెట్టవద్దు. తులసి మొక్కను ఉంచే ప్రదేశంలో ఎలాంటి మురికి ఉండకూడదని గుర్తుంచుకోండి.

5 /9

శివలింగం: శివుని విగ్రహం కూడా తులసి మొక్క వద్ద ఉంచరాదు. పూర్వ జన్మలో తులసి జలంధరుడి భార్య అని నమ్మకం. జలంధరుడి క్రూరత్వం పెరిగినప్పుడు శివుడు అతడిని చంపాడు. శివుని పూజలో తులసిని ఉపయోగించకపోవడానికి కారణం ఇదేనని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.

6 /9

పాదరక్షలు: తులసి మొక్క ప్రదేశంలో పాదరక్షలు అసలు ఉంచకూడదు. బూట్లు, చెప్పులు ఉంచితే ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది.

7 /9

ముళ్ల మొక్కలు: తులసి మొక్క వద్ద ముళ్ల మొక్కలు ఉండకూడదు. ముళ్ల మొక్కలు అంటే ప్రతికూల ప్రభావం చూపేవి. ఇవి తులసీ వద్ద ఉంచరాదు.

8 /9

లక్ష్మీదేవి అనుగ్రహం: తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

9 /9

(గమనిక: పైన తెలిపిన సమాచారం ఒక అవగాహన కోసం మాత్రమే. జీ న్యూస్‌ దీనిని ధృవీకరించడం లేదు)