Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

Devara Villain Saif Relation With YSR Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఫీవర్ నడుస్తోంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో మొదలైంది. అంతేకాదు పలు చోట్ల ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సైఫ్ అలీ ఖాన్. ఈయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.

1 /6

ఏంటి.. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ను వైయస్ కుటుంబానికి అనుబంధమేమిటా ఆలోచిస్తున్నారా.. అవును దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి చిత్రమైన అనుబంధమే ఉంది.

2 /6

బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ షర్మిలా ఠాకూర్ కుమారుడే సైఫ్ అలీ ఖాన్. ఈమె అప్పటి మన దేశ క్రికెట్ గా  కెప్టెన్ పనిచేసిన మన్సూర్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

3 /6

షర్మిలా ఠాకూర్, పటౌడీల కుమారడే సైఫ్ అలీ ఖాన్. తల్లి బాటలో బాలీవుడ్ లో హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

4 /6

టాప్ హీరోకు తక్కువ. సైడ్ హీరోకు ఎక్కువ అన్నట్టు దాదాపు కెరీర్ లో ఎక్కువగా సెకండ్ హీరోగానే నటించాడు సైఫ్ అలీ ఖాన్. అంతేకాదు ఈయన ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో లంకేశ్వరుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా హిందీ, తెలుగులో తెరకెక్కింది.

5 /6

ఒక రకంగా ‘ఆదిపురుష్’ సినిమా సైఫ్ ఫస్ట్ తెలుగు మూవీ అని చెప్పాలేమో. ఆ సంగతి పక్కన పెడితే.. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ ఒకప్పటి యువతకు కలల రాణి.

6 /6

అంతేకాదు దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి .. షర్మిలా ఠాకూర్ కు వీరాభిమాని. అందుకే తన కూతురుకు   తన ఫేవరేట్ హీరోయిన్ అయిన షర్మిలా పేరు పెట్టుకున్నాడు. మన తెలుగు వాళ్లు అంతగా ఈ పేరు పెట్టుకోరు. ఉత్తరాది వాళ్లే పెట్టుకుంటారు. ఈ రకంగా దేవర విలన్ సైఫ్ కు వైయస్ఆర్ కు మధ్య ఉన్న చిత్రమైన అనుబంధం ఇదే.