OTP Scams: ఓటీపీ స్కామ్స్ ఎలా ఉంటాయి, ఎలా తప్పించుకోవచ్చు

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్‌కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి మోసంతో ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్‌లైన్‌లో మీ డబ్బులు కాజేస్తుంటారు. అయితే కొన్ని పద్థతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి కాపాడుకోవచ్చు.  అవేంటో తెలుసుకుందాం..

OTP Scams: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్‌కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి మోసంతో ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్‌లైన్‌లో మీ డబ్బులు కాజేస్తుంటారు. అయితే కొన్ని పద్థతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి కాపాడుకోవచ్చు.  అవేంటో తెలుసుకుందాం..

1 /5

అందుకే పొరపాటున కూడా ఎవరికీ ఓటీపీ షేర్ చేయవద్దు. ఒకవేళ ఓటీపీ స్కామ్ జరిగిందని అన్పిస్తే బ్యాంక్‌ను సంప్రదించండి. లేదా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి

2 /5

మోసం చేసేవాళ్లు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేయమంటారు. మీరు గుర్తుంచుకోవల్సింది ఏంటంటే బ్యాంక్ లేదా సంస్థ ఎప్పుడూ ఓటీపీ అడగదు. ఒకవేళ మీకు మెస్సేజ్ వస్తే ఆ నెంబర్ వెంటనే బ్లాక్ చేయండి

3 /5

నేరాలు, మోసాలు చేసేందుకు తెలియని నెంబర్ నుంచి బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుని ఫోన్ చేస్తారు. ఓటీపీ అడుగుతారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయండి

4 /5

ఆన్‌లైన్ మోసగాళ్లు మీకొక ఫేక్ మెయిల్ పంపిస్తారు. అది బ్యాంక్ నుంచి వచ్చిందనుకుంటారు. ఈ మెయిల్‌లో ఓటీపీ ఎంటర్ చేయమని సూచిస్తారు. ఇందులో గ్రామర్ మిస్టేక్స్ ఉండవచ్చు. అలాంటివి కన్పిస్తే జాగ్రత్త పడండి

5 /5

ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి షేర్ చేయకూడదు. బ్యాంక్ ఉద్యోగి అనో లేదా ప్రభుత్వ అధికారి అనో మీకు ఫోన్ చేసి చేసి ఓటీపీ అడగవచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండండి.