Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?

Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్‌ న్యూస్‌ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రోజు అధికారిక సెలవు రానుంది. ఎందకుంటే ఈ మేరకు రాష్ట్ర సెక్రటేరియట్‌ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలో వచ్చే రాష్ట్ర పండుగ బతుకమ్మ దీన్ని పిల్లలు పెద్దాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో ఈ పండుగ కూడా ఎంతో విశేషమైంది.  

2 /5

ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్‌ 2 ప్రారంభమైంది.ఇది 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే, ఈరోజు ఆప్షనల్‌ హాలిడే కాకుండా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర సెక్రటేరియట్‌ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.  

3 /5

ఈ మేరకు సీఎంఓ శేషాద్రిని కలిసి విన్నపించింది. అక్టోబర్‌ 10 గురువారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం  స్పందిస్తే ఆరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అధికారిక సెలవు వస్తుంది. దీంతో ఉద్యోగులకు రాష్ట్ర పండుగకు కూడా అధికారిక సెలవు దినం వస్తుంది. ఇది వారికి తీపి కబురు అవుతుంది.  

4 /5

ఇక తెలంగాణలో ఉన్న అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి అధికారిక సెలవు దినంతోపాటు అక్టోబర్ ౩ నుంచి దసరా సెలవులు వచ్చాయి. మళ్లీ పాఠశాలలు అక్టోబర్‌ 15వ తేదీ తిరిగి తెరచుకుంటాయి. అంటే ఈసారి భారీగా 12 రోజులు దసరా సెలవులు పాఠశాలలకు వచ్చాయి.  

5 /5

ఇదిలా ఉండగా అక్టోబర్‌ 10 పెద్ద బతుకమ్మ, మరుసటి రోజు ఆయుధపూజ, అక్టోబర్‌ 12 శనివారం దసరా పండుగ. అంతేకాదు ఈ నెలలోనే చివరి రోజు అయిన అక్టోబర్‌ 31న దీపావళి పండుగ కూడా జరుపుకోనున్నారు. ఆ రోజు కూడా అధికారిక సెలవు దినం. ఈ నెలలో పాఠశాలలతోపాటు బ్యాంకులు కూడా కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తాయి.