School Holidays: బిగ్‌ అలెర్ట్‌.. భారీవర్షాలు ఈ జిల్లాల్లో అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

School Holidays In AP: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలలోని స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ సందర్భంగా ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి ?
 

1 /7

School Holidays In AP: రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో కొన్ని జిల్లాలలోని స్కూళ్లకు సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ జిల్లాలలో భారీ వర్షపాతం నమోదవుతుందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.  

2 /7

మరో 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా తీరాలవైపు వాయుగుండం కదులుతుందని అమరావతి వాతావారణ శాఖ చెప్పింది.  

3 /7

తీవ్ర వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.  

4 /7

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ సందర్భంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.  

5 /7

ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీకు ఇవాళ 15 మంగళవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సెలవు మంజూరు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.   

6 /7

ఈ జిల్లాలలో మరో మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ ప్రాంతంలో గంటకు 55 కిలో మీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. మత్స్య కారులు కూడా వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  

7 /7

గత నెలలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత పండుగలు, మొన్నటి వరకు దసరా సెలవులతో స్కూళ్లకు  సెలవులు దాదాపు 13 రోజులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల మళ్లీ స్కూళ్లకు సెలవులు వస్తూనే ఉన్నాయి.