Election Schedule 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పూర్తి తేదీలివే

Election Schedule 2024: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ నెలలో రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ రూపొందించారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2024, 05:04 PM IST
Election Schedule 2024: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పూర్తి తేదీలివే

Election Schedule 2024: దేశంలో ఇటీవలే హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ నెలలో ముగియనున్నాయి. 

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26న, జార్ఘండ్ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మహారాష్ట్రంలో మొత్తం 285 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం  9 కోట్ల 63 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 186 పోలింగ్ బూత్‌లు, 29 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 

మహారాష్ట్రలో అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 4 నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 285 అసెంబ్లీ స్థానాలను సింగిల్ ఫేజ్‌లో జరగనున్నాయి. 

ఇక 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మొత్తం 2.86 కోట్ల ఓటర్లున్నారు. జార్ఖండ్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 18న వెలువడనుంది. అక్టోబర్ 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. నవంబర్ 13న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇక రెండో దశ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడనుండగా నామినేషన్లు అక్టోబర్ 29 వరకూ స్వీకరిస్తారు. అక్టోర్ 30 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 20 పోలింగ్, నవంబర్ 23న ఫలితాలు వెలుడనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరగనున్నాయి. 

Also read: Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News