TG School Holiday: విద్యార్థులకు మరో గుడ్న్యూస్ ఈనెల అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటిస్తూ సెలవు అన్ని పాఠశాలలకు ఆదేశాలను జారీ చేశారు. గత నెల నుంచి విద్యార్థులకు సెలవులు భారీగానే వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సెలవులు వచ్చాయి. అంతేకాకుండా దసరా పండుగ సెలవులు కూడా దాదాపు రెండు వారాల పాటు సెలవులు రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ఇప్పుడు అక్టోబర్ 31న కూడా తెలంగాణలో సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
TG School Holidays: విద్యార్థులకు భారీ సెలవులు ఇప్పటికే వర్షాల నేపథ్యంలో వచ్చాయి. ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు కూడా సెలవులు వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటించారు.
దసరా సందర్భంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచే సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 14 వరకు పండుగ సెలవులు వచ్చాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఎస్ఏ1 పరీక్షలు కూడా నిర్వహించాయి. ఆ తర్వాత దసరా పండుగ సెలవులను ప్రకటించాయి. అయితే, మరికొన్ని పాఠశాలలు 21వ తేదీ నుంచి స్కూళ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
దసరా సెలవులు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు. అదనంగా అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా సెలవు వచ్చింది. అయితే, ఈ నెల 31న కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఆరోజు సెలవు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈనెల 20,27 కూడా రెండు రోజులు సెలవు. ఎందుకంటే ఆ రెండు రోజులు ఆదివారాలు.
2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో కూడా 23 నుంచి 27 వరకు సెలవులు ప్రకటించాయి. అలాగే 2025 జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. దసరా సెలవులు ముగియగానే కొన్ని పాఠశాలలు ఇప్పటికే పరీక్షలు నిర్వహించడానికి సన్నధమవుతున్నాయి.
ఇక అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఈరోజున సెలవు ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకుంటున్నారు. కానీ, తెలంగాణ విద్యా శాఖ అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. ఎందుకంటే ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు.