Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీ.. మధ్యలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఇదేందయ్యా..!

Ys Jagan Vs Sharmila:​ జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 26, 2024, 11:49 AM IST
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీ.. మధ్యలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఇదేందయ్యా..!

Ys Jagan Vs Sharmila:​  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, షర్మిల ఆస్తుల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు జూనియర్ ఎన్టీఆర్ ను తాకింది. గత రెండు రోజులుగా ఏపీలో జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఐతే దీనిపై వేసీపీ, టీడీపీ మధ్య పెద్ద మాటల యుద్దమే నడుస్తుంది. జగన్ కుటంబ వ్యవహారంలో టీడీపీకీ ఎందకు అంత ఆసక్తి. కుటుంబ తగాదాలను కూడా టీడీపీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గు చేటు అని వైసీపీ విమర్శించింది. ఇదే సమయంలో సొంత చెల్లిని, తల్లిని రోడ్డు పాలు చేసి కోర్టుకెక్కిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని టీడీపీ ఘాటుగా విమర్శిస్తుంది. ఇలా వైసీపీ,టీడీపీల మద్య తీవ్ర స్థాయిలో కౌంటర్లు,ఎన్ కౌంటర్లు నడుస్తున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయంగా వాడుకొని రోడ్డు మీద పడేశారని టీడీపీ విమర్శలు సంధించింది. దీనికి కౌంటర్ గా  వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేసింది. జూనియర్ ను ఎన్నికల కోసం వాడుకుంది నిజం కాదా..కనీసం జూనియర్ ఎన్టీఆర్ కు సభ్యత్వం కూడా  ఇవ్వలేదనే కదా  మీకు దూరంగా ఉంది. అసలు వాడకం అంటే చంద్రబాబుకు తెలిసనంతా ఎవరికీ తెలియదని మాజీ మంత్రి పేర్నీ నాని విమర్శించారు. పేర్ని నాని జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో ఇష్యూ జూనియర్ ఎన్టీఆర్ పైకి మళ్లింది. జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటి వరకు అసలు టీడీపీ సభ్యత్వం లేదా అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతుంది. 

తాత పెట్టిన పార్టీలో జై.ఎన్టీఆర్ కనీసం సభ్యత్వం కూడా లేకపోవడం ఏంటని అటు రాజకీయ వర్గాల్లో ఇటు జూ. అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది.  అసలు జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం లేదని పేర్ని నాని చెప్పేవరకు బయటపడలేదని టాక్ నడుస్తుంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో అటు తిరిగి ఇటు తిరిగి జూనియర్ ప్రస్తావన వస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  తమ హీరో రాజకీయాలకు దూరంగా పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టి పెట్టాడని అలాంటి మా హీరోను అనవసరంగా రాజకీయాల్లోకి లాగవద్దని అభిమానులు కోరుతున్నారు.

మొత్తానికి జగన్ ,షర్మిల ఆస్తుల వివాదంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ సభ్యత్వం ఎందుకు ఇవ్వలేదు. దీని వెనుక ఎవరు ఉన్నారనే చర్చ కూడా జరుగుతుంది. మరి జూనియర్  ఎన్టీఆర్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.‌

Read more: KTR Vs Ponguleti: ఏ పీక్కుంటావో పీక్కో..?.. మంత్రి పొంగులేటీ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News