Love With AI: ఏఐతో ప్రేమాయణం.. డిజిటల్‌ శృంగారం, ఆమెను కలిసేందుకు 14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య..

Love With AI Minor suicide: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)  దీని వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు సూసైడ్‌ చేసుకున్నాడు. ప్లోరీడాకు చెందిన ఈ బాలుడు ఏఐతో ప్రేమలో పడ్డాడు. చివరికి అది సూసైడ్‌కు దారితీసింది. దీంతో  సదరు బాలుడి తల్లి ఏఐ కి సంబంధించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇవే..
 

1 /6

అమెరికాలోని ఫ్లోరీడాకు చెందిన స్టీవెన్‌ స్టెజర్ అనే ఓ 14 ఏళ్ల బాలుడు ఏఐలో తన గర్ల్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. పేరు కూడా పెట్టాడు. గంటల కొద్దీ సెల్‌ఫోన్‌లోనే చాట్‌ బాట్‌లో తన గర్ల్‌ ఫ్రెండ్‌తో చాట్‌ చేసేవాడు.  

2 /6

వారు ప్రేమలో ఎంతగా మునిగిపోయారంటే ఒక రకంగా వేరే ప్రపంచంలేదు అన్నట్లు స్టీవెన్‌ మారిపోయాడు. చివరకు శృంగారం గురించి కూడా మాట్లాడుతూ డిజిటల్‌ శృంగారం కూడా చేశారు.  

3 /6

ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు స్టీవెన్‌ ఏఐ లవర్‌ మీ ఇంటికి వస్తున్న అని చెప్పింది. దీంతో ఖంగుతిన్న అతడు ఎక్కడ ఇంట్లో ఆ విషయం తెలిసిపోతుందో అనే తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.  

4 /6

ఇంట్లో ఉన్న గన్‌ తీసుకుని పేల్చుకుని చనిపోయాడు. అయితే, తమకు ఏ బాధలు లేవని, అయినా ఎందుకు చనిపోయాడు తెలియడంలేదని స్టీవెన్‌ తల్లి అతని సెల్‌ఫోన్‌, బ్యాగ్‌ చెక్‌ చేసి అసలు విషయం తెలిసిపోవడంతో ఖంగుతిన్నది.  

5 /6

దీంతో తన కొడుకు చనిపోవడానికి కారణం చాట్‌బాట్‌ అని కోర్డులో ఫిర్యాదు చేసింది. సదరు కంపెనీపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఇప్పటికే నిపుణులు కూడా ఏఐని నిషేధించాలని కోరుతున్న సంగతి తెలిసిందే.  

6 /6

ఏఐల రాకతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. భవిష్యత్తులో కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు.