Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్

Minister Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తనదైన మార్క్‌ చూపిస్తున్నారా..! తన సొంత నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నేతలకు బంపరాఫర్‌ ప్రకటించారా..! మంత్రి పొంగులేటి ఆఫర్‌తో సీపీఎం నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఇంతకీ పాలేరు మంత్రి పొంగులేటి ఏం చేస్తున్నారు..!  

Written by - G Shekhar | Last Updated : Oct 26, 2024, 04:57 PM IST
Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్

Minister Ponguleti Srinivas Reddy: ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో మిత్రపక్షమైన సీపీఐ చోటు కల్పిస్తున్న మంత్రి.. ఇప్పుడు సీపీఎం పార్టీ సభ్యులకు కూడా చోటు కల్పిస్తుండటం ఆసక్తికరంగా మారింది. స్ధానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రి పావులు కదుపుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. అయితే మిగతా నియోజకవర్గాలకు విరుద్దంగా పాలేరులో మంత్రి పొంగులేటి తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీ శ్రేణులు పరేషాన్‌ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Also Read: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఆరుగురు అక్కడిక్కడే మృతి..
 
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీల నియామకం జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చైర్మన్‌గా ఇందిరమ్మ కమిటీలు నియమిస్తున్నారు. ప్రతి గ్రామానికి ఐదుగురు సభ్యుల చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా ఇందిరమ్మ కమిటీల నిర్మాణం జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లా మొత్తం ఒకలా ఉంటే.. పాలేరు మాత్రం కమిటీల నిర్మాణం మరోలా ఉందట.. ప్రస్తుతం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలకే ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల మిత్రపక్షమైన సీపీఐ పార్టీ నేతలకు చాన్స్‌ ఇస్తున్నారు. కానీ సీపీఎం నేతలకు కూడా అవకాశం కల్పించడం లేదు.. కానీ.. పాలేరు మాత్రం సీపీఎం సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తుండటం ఆసక్తికరంగా మారింది. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ పోటీ చేసింది. కొత్తగూడెంలో కూనంనేనికి టికెట్ కేటాయించడంతో గెలుపొందారు. కానీ సీపీఎం పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరులో ఒంటరిగా పోటీ చేసిన తమ్మినేని వీరభద్రంకు 2 శాతం ఓట్లు కూడా రాలేదు.. తమ్మినేని వీరభద్రంకు పాలేరు సొంతూరు అయినప్పటికీ ఓట్లు తెచ్చుకోవడంలో ఆయన విఫలమయ్యారు. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఘన విజయం సాధించడంతో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే పాలేరులో సీపీఎం పార్టీకి గ్రామాల్లో మంచి పట్టుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ సభ్యులను కలుపుకుని వెళితే పాలేరులో మరింత పట్టు పెంచుకోవచ్చని మంత్రి ఆలోచనగా ఉందని అనుచరులు చెబుతున్నారు.. 
 
మొత్తంగా మంత్రి పొంగులేటి వ్యూహం వెనుక స్థానిక సంస్థల ఎన్నికలే కారణంగా తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో పాలేరులో తిరుగులేని విజయాన్ని సాధించాలని మంత్రి పొంగులేటి భావిస్తున్నారట. అందుకే సీపీఎం నేతలకు కూడా ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని డిసైడ్‌ అయ్యారట. ప్రస్తుతం పినపాక, వైరా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ కమిటీల్లో కేవలం సీపీఐ సభ్యులకే చాన్స్ ఇస్తున్నారు. అయితే మంత్రిగారి నిర్ణయం తెలుసుకుని వాళ్లు కూడా ఆయా నియోజకవర్గాల్లో సీపీఎం సభ్యులకు చోటు కల్పించే ఆలోచన చేస్తున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Read More: KTR Vs Ponguleti: ఏ పీక్కుంటావో పీక్కో..?.. మంత్రి పొంగులేటీ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x