Jayasudha Personal life: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి చేతుల్లో ఎవరు ఇబ్బందులు..పడతారో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగులు వేస్తారు. ఇంకొంత మంది ఇతరులను నమ్మాలంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం.. ఇండస్ట్రీలో పేరు మోసిన ఇద్దరిని నమ్మి ఘోరంగా మోసపోయిందట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధకు గతంలో.. భారీ షాక్ తగిలింది. ఉన్నది మొత్తం పోగొట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి, నాగబాబుని నమ్ముకుంట.. ఆమెను నట్టేట ముంచారట. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ని ఏలిన తెలుగు అమ్మాయిలలో జయసుధ ఒకరు. దాదాపు మూడు తరాల హీరోలతో జతకట్టింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత బిజెపిలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారింది. 1987లో కాంచన సీత అనే టైటిల్ తో ఒక చిత్రం కూడా నిర్మించింది. అనంతరం కలికాలం, మేరా పత్ని సిర్ఫ్ మేరా హై, అదృష్టం, వింత కోడళ్ళు వంటి చిత్రాలను నిర్మించింది. అయితే ఇవేవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు అయినా సరే జయసుధ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోలేదు అని చెప్పాలి.
అయితే హేండ్సప్ అనే చిత్రం మాత్రం ఆమెను మరోసారి నిర్మాణం వైపు వెళ్లకుండా చేసింది. 1999లో విడుదలైన.. ఈ సినిమా జయసుధకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇందులో జయసుధ, బ్రహ్మానందం, నాగబాబు ప్రధాన పాత్రలు పోషించగా చిరంజీవి ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆయన జయసుధ భర్తగా క్లైమాక్స్ లో కనిపించారు. కోటా శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, సోనుసూద్ , తనికెళ్ల భరణి తదితరులు నటించారు.
ఇకపోతే హాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి స్వయంగా జయసుధ కథ సమకూర్చారు. సినిమా ఎలా ఉన్నా చిరంజీవి గెస్ట్ అప్పియరేన్స్.. అయినా కాపాడుతుందని జయసుధ భావించిందేమో.. దీనికితోడు కథ, స్క్రీన్ ప్లే లో మేటర్ లేదు. అనుకున్నట్టుగా పూర్తిస్థాయిలో కామెడీ కూడా పండలేదు.
అంతే కాదు వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు చిరంజీవి, నాగబాబు ఈ సినిమాలో నటించారు. కానీ వీరి ఇమేజ్ ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు. అలా మొత్తానికైతే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు ఈ చిత్రం తీసుకొచ్చిన నష్టాలకు.. జయసుధ రోడ్డున పడిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.