Revanth Reddy: పాదయాత్రకు రేవంత్‌ సిద్ధం.. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా డైవర్షన్‌ పాలిటిక్స్‌?

Revanth Reddy Diversion Politics With Padayatra: తెలంగాణలో మరోసారి పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో వెంటనే రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. మూసీ నది వెంట పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన యాత్ర షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది.

1 /9

కొత్త ఎత్తుగడ: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ పుంజుకుంటుండడం.. కాంగ్రెస్‌ ప్రభావం తగ్గిపోవడంతో రేవంత్‌ రెడ్డి సరికొత్త ఎత్తుగడ వేసుకున్నారు. దీనికితోడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు సిద్ధమైన వేళ రేవంత్‌ యాత్ర త్వరగా చేపట్టాలని తొందర పడుతున్నారు.

2 /9

కేటీఆర్ కు పోటీగా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నాడు. వారికి ఆదరణ రాకుండా.. ఏడాది పాలన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రంగంలోకి దిగుతున్నట్లు చర్చ జరుగుతోంది.

3 /9

మూసీ పేరిట: పేదల ఇళ్లు కూల్చేసి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు చేపడతానని చెప్పిన రేవంత్‌ రెడ్డి దానికి గుర్తింపు తీసుకొచ్చేందుకు తంటాలు పడుతున్నారు. తాను చేపట్టే మూసీ ప్రాజెక్టుకు ప్రజా మద్దతు కూడగట్టేందుకు రేవంత్‌ యాత్రకు పూనుకున్నారు.

4 /9

అక్కడి నుంచే: వాడపల్లి నుంచి మూసీ వరకు పాదయాత్ర చేస్తానని ఇప్పటికే రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

5 /9

అప్పటి నుంచే: ఈనెల 8వ తేదీ నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

6 /9

యాదాద్రి నుంచి మొదలు: యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి యాత్రను ప్రారంభించనున్నారని సమాచారం. యాత్ర ప్రారంభం రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

7 /9

మూసీ పరివాహకం: అనంతరం మూసీ పరివాహక జిల్లాలైనా సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపడతారని సమాచారం.

8 /9

అధికారంలో ఉండి: ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అధికారంలో ఉన్న పాదయాత్ర చేయడం ఇది వింతగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

9 /9

వైఫల్యాలు కప్పిపుచ్చి: పాదయాత్ర చేపట్టడం వెనుక తన పది నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు.. తాను చేపట్టిన మూసీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం కోసమే రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపడుతున్నట్లు చర్చ జరుగుతోంది.