Raj Bhavan: గవర్నర్‌తో రేవంత్‌ రెడ్డి రహాస్య భేటీ? కొన్ని నిమిషాలు చర్చ

Revanth Reddy And His Team Meets To Governor: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ప్రచారం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా గవర్నర్‌తో రేవంత్‌ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్‌ భవన్‌లో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

1 /5

అకస్మాత్తుగా: హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో బుధవారం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

2 /5

రహాస్య భేటీ?: కొన్ని నిమిషాల పాటు గవర్నర్‌తో రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపారనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

3 /5

సర్వే ప్రస్తావన: సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే విషయాలను గవర్నర్‌కు రేవంత్‌ రెడ్డి వివరించారు.

4 /5

కేంద్రం దృష్టికి: తాము చేపట్టే కుల గణన వివరాలను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్‌ రెడ్డి కోరారు.

5 /5

ఆహ్వానం: త్వరలో జరగనున్న తన సోదరుడి కుమార్తె వివాహానికి గవర్నర్‌ను ఆహ్వానించారని సమాచారం. రేవంత్ వెంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.