Budha Vakri : ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాల్లో సౌమ్యుడిగా పేరున్న బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు బుద్ధి, విద్యా బుద్ధులతో పాటు, ఎవరితో ఎలా మసలుకోవాలో చెబుతాడు. బుధుడు వక్ర గమనం వల్ల ఏయే రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయో చూద్దాం..
నవంబర్ 27 న బుధుడు వృశ్చికరాశిలో వక్రంలో ప్రయాణించబోతున్నాడు. వృశ్చికరాశిలో బుధుడి తిరోగమనం కారణంగా, కొన్ని రాశుల వారికీ అపారమైన కీర్తి ప్రతిష్టలతో పాటు.. ఇంట్లో ధన రాశిని ఇవ్వనున్నాడు. కొన్ని రాశుల వారు జాగ్రత్తగా మెలగాలి.
జ్యోతిష్య శాస్త్రంలో బధుడు మేధస్సు, కమ్యూనికేషన్, తర్కం, గణితం, తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా పేరుంది. గ్రహాల రాకుమారుడిగా పేరు ఉంది. బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు, ఆయా రాశుల వ్యక్తులకు మంచి ఫలితాలను అందుకుంటారు. నవంబర్ 27న బుధుడి తిరోగమణం కారణంగా కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఇవి ఏయే రాశుల వారికీ అదృష్టం తీసుకురాబోతుంది.
వృషభం.. బుధుడి వక్ర గమనం కారణంగా వృషభ రాశి వారికీ అనుకూలంగా ఉండబోతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉంటే బెటర్. ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం. అనుకోని లాభాలను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.
మిథునం.. మిథున రాశి వారికీ బుధుడి వక్ర గమనం వల్ల విద్యార్ధులకు పెద్ద ఊరట. ప్రభుత్వ అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో స్థాన చలనం ఉంటుంది. లాభం పెరుగుతుంది. ఆదాయంలో పెను మార్పులు వస్తాయి.
కన్య - బుధుడి వక్ర గమనం వల్ల మీ లైఫ్ కొత్త టర్న్ తీసుకుంటుంది. కోసం మీ దరి చేరనీయవద్దు. మేథోపరమైన పనుల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు వల్ల మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతారు.
తుల - బుధుడు వక్ర గమనం వల్ల మీలో ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మనసులో ప్రతికూల ఆలోచనలకు చెక్ పెట్టండి. జీవిత భాగస్వామితో మంచిగా మెలగాలి. ఆదాయం పెరుగుతాయి. లాభాలను అందుకుంటారు.
వృశ్చిక రాశి.. బుధుడు వక్ర గమనం వల్ల ఈ రాశి వారికీ శాంతి, ఆనందం ఆహ్లాదం కలుగుతుంది. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
కుంభ రాశి.. బుధుడి వక్ర గమనం వల్ల ఈ రాశి వారికీ అనుకొని ప్రయత్నం వల్ల డబ్బులు చేతికి అందుకుంటారు. చేసే వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. తల్లిదండ్రుల మూలంగా ఆస్తి కలిసి రావచ్చు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం ఇంటర్నెట్ మరియు జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలను మేము ఇక్కడ తెలిపాము. ZEE Media దీన్ని ధృవీకరించడం లేదు.