AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Rains: ఏపీని వరుణ దేవుడు ఒదలడం లేదు. గత కొన్ని రోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కు మరో వర్షం గండం పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు నెమ్మదిగా కదులుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షలాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అలర్ట్ చేసింది.
ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఈ రోజు కాకినాడ,నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ,తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందట. నవంబర్ 12న అంటే మంగళవారం కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి నెల్లూరు, శ్రీసత్యసాయి, జిల్లాలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేసింది.
నవంబర్ 13న అంటే బుధవారం.. గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కాకినాడ, కోనసీమతో పాటు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ న విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందట.
ఇక నవంబర్ 14 గురువారం రోజున గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
అటు కాకినాడ, కోనసీమ, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.