Heavy Rain In Hyderabad Various Areas And Heavy Rainfall Alert For Telangana: వేసవి సమీపిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Telangana Rains On Sankranti: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‍నగర్‌లో దాదాపుగా 65 రోజుల తర్వాత వానజల్లు కురిసినట్లు పేర్కొన్నారు. అయితే పండుగ రోజున హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Telangana Corp Loss: మొంథా తుపాను కారణంగా తెలంగాణలో లక్షా 17 వేల 757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ 10 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి.మొంథా తుపాను శాంతించి అనుకునేలోపు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా నవంబర్ వంటి అన్ సీజన్ లో వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు వరంగల్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో కాపుకు వచ్చిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి.
Telugu States Rain Updates: మొంథా తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Floods:వరంగల్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిపోయిన సమ్మయ్య నగర్, నయీం నగర్ ను పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
Telangana Paddy Loss: మొంథా తుపాను బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుండనుంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. గురువారమే వెళ్లేందుకు ఆయన సిద్ధపడగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని పేర్కొంటూ ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు.
గత మూడు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణను అతలాకుతలం మొంథా తుపాను బలహీన పడింది. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తీరం దాటిన తర్వాత బలహీనపడిన మొంథా తుఫాన్, ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీక్రుతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వర్షపాతం తీవ్రత గణనీయంగా తగ్గిపోయింది. వాయుగుండం తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్ ప్రాంతాల వైపు కదులుతోంది.
Montha Cyclone Live Updates: ఉరుము వచ్చి మంగళం మీద పడ్డట్టు మొంథా తుపానుతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తంగా ఆగమాగం అయింది. మరోవైపు మొంథా తుపాను దిశ మార్చుకొని తెలంగాణపై విరుచుపడుతుంది. దీంతో ఏపీతో పాటు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Montha Cyclone Effect On Telangana : తెలంగాణపై మొంథా తుపాను దిశ మార్చుకుని విరుచుకుపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Cyclone Montha Effect on Telangana: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా రేపు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ వెదర్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Hyderabad Floods: మొంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు మూసీ పరివాహాక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో అధికారులు జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేశారు.
Heavy Rains Lashed At Yadadri Lakshmi Narasimha Swamy Temple: యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.. కొండపై భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే కొండపై వర్షం పడితే తలదాచుకునే కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి.
Telangana Weather Forecast:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ పడనున్నాయి. నిన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతము దాని సమీపంలో ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాహత ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురనున్నట్టు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains: తెలంగాణపై వాయుగుండ ప్రభావం కనిపిస్తోంది. రానున్న 3 రోజులు వర్షాలుకురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains School Holidays : తెలంగాణలో మరో మూడు రోజలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
Telangana Rains: తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana Weather: తెలంగాణలో వాతావరణం మారుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.