IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం త్వరలో జరగనుంది. ఈసారి జరిగేది మెగా వేలం కావడంతో ఇప్పటికే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలు విడుదల చేశాయి. ఈసారి వేలానికి స్టార్ ఆటగాళ్లు చాలామంది వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి వేలానికి భారీ ధర పలికేందుకు 5 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
రచిన్ రవీంద్ర రచిన్ రవీంద్ర కనీస ధర 1.5 కోట్ల రూపాయలు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి ఇతడిని రిటైన్ చేసుకోలేదు. రచిన్ రవీంద్ర ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్ కమ్ బ్యాటర్ కావడంతో అందరి దృష్టి ఇతనిపై పడనుంది
జోస్ బట్లర్ ఇతడి కనీస ధర 2 కోట్ల రూపాయలు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని రిలీజ్ చేసింది. అయితే వేలంలో తీరిగి తీసుకునే అవకాశాలున్నాయి. అద్భుతమైన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్.
మొహమ్మద్ షమి మొహమ్మద్ షమి కనీస ధర 2 కోట్ల రూపాయలు. ఈ స్టార్ బౌలర్‌ను ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఇతనిపై పడనుంది
శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కనీస ధర 2 కోట్లు. ఢిల్లీ కేపిటల్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ కోసం 25 కోట్ల వరకూ ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ జట్టుకు ఓ మంచి కెప్టెన్ అవసరముంది. 2024 ఐపీఎల్ టైటిల్ కేకేఆర్ జట్టుకు సాధించి పెట్టింది శ్రేయస్ అయ్యరే.
రిషభ్ పంత్ రిషభ్ పంత్ కనీస ధర 2 కోట్లు కాగా ఈసారి ఇతని కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సిద్ధమౌతున్నాయి. లేదా ఢిల్లీ కేపిటల్స్ జట్టే తీసుకుంటుందా అనేది చూడాలి
ఐపీఎల్ 2025 మెగా వేలంలో దాదాపు ఐదు మంది కెప్టెన్లు ఉన్నారు. స్టార్ బౌలర్లు, బ్యాటర్లు, ఆల్ రౌండర్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ఐదుగురు ఆటగాళ్లపై ఉండనుంది. ఈ ఐదుగురి కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమౌతున్నాయి.