రిలయన్స్ జియో 4జీ వినియోగదారులకు ఒక చేదు నిజం... "జియో 4జీ స్మార్ట్ ఫోన్ కొన్నవారు ఇకనుండి తప్పనిసరిగా సంవత్సరానికి 1500 రూపాయలు చొప్పున మూడేళ్లపాటు 4500 రూపాయలతో తప్పనిసరిగా రీచార్జ్ చేసుకోవాలి. లేకపోతే మీరు కట్టిన అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు రూ.1500 వాపసురాదు. అంతేకాదు ఫోన్ రిటర్న్ చేస్తే జీఎస్టీ బాదుతాము" అని జియో తన అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది.
సంవత్సరం పాటు ఉపయోగించి ఫోన్ రిటర్న్ చేస్తే 1500 రూపాయలు+జీఎస్టీ బాదుతారు. రెండో సంవత్సరం రిటర్న్ చేస్తే 1000+జీఎస్టీ, చివరగా మూడో సంవత్సరం రిటర్న్ చేస్తే 500+జీఎస్టీ కట్టాలి. జియో విధించిన ఈ తాజా నిబంధనలను చూసి కస్టమర్లు మండిపడుతున్నారు. ఈ నిబంధన గురించి ముందే చెప్పాల్సిందని అంటున్నారు. జియో సిమ్ మీద కూడా ఎటువంటి ప్రకటన చేస్తాడో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.