7th Pay Commission DA Merge Updates in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. దాంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేసే విషయమై చర్చ నడుస్తోంది. ఇప్పుడీ విషయమై బిగ్ అప్‌డేట్ వెలువడింది.
7th Pay Commission DA Merge Updates in Telugu: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి ఉంది. డీఏ 50 శాతం దాటడంతో అప్పటి ప్రభుత్వం కనీస వేతనంలో విలీనం చేసింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డీఏ 53 శాతం కావడంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యదిక ప్రయోజనం కలగనుంది.
ఈ అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్‌గానే ఉందని, త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోనున్నారు.
అక్కడితో ఆగదు. ఉద్యోగుల జీతభత్యాలు, బోనస్, పెన్షన్, ఇతర అలవెన్సులు, డీఏ అన్నీ బేసిక్ శాలరీ ఆధారంగా ఉండటంతో అవన్నీ గణనీయంగా పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంలో డీఏను కలిపితే కనీస వేతనం దాదాపుగా రెట్టింపు అవుతుంది. ఉద్యోగు జీతభత్యాల్లో మార్పు వస్తుంది.
ఇప్పుడు కూడా డీఏ 50 శాతం దాటి 53 శాతానికి చేరుకోవడంతో కనీస వేతనంలో కలపాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదే జరిగితే ఉద్యోగుల జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. అటు పెన్షనర్ల పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది.
ఇంతకుముందు అంటే 2004లో ఇదే పరిస్థితి ఉంది. అప్పట్లో మొత్తం డీఏ 50 శాతం దాటడంతో కనీస వేతనంలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కించారు.
5,6 వేతన సంఘాల్లో చేసిన సిఫార్సుల ప్రకారం డీఏ 50 శాతం దాటితే కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు 53 శాతం డీఏ దాటడంతో కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది.
పెరిగిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి రావడంతో మొత్తం మూడు నెలల ఎరియర్లతో కలిపి చెల్లించారు. వచ్చే ఏడాది జనవరి 2025 నుంచి తిరిగి డీఏ పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇటీవలే డీఏ, డీఆర్ 3 శాతం పెరిగింది. ఫలితంగా మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ లేదా డియర్‌నెస్ రిలీఫ్ 53 శాతానికి చేరుకుంది.