Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?

Tirupati Temple:తిరుమల శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. అలాంటి తిరుపతిలో గతంలో జరిగిన ఘటన ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీంతో హిందు సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి.
 

1 /5

తిరుమల శ్రీవారిని భక్తులు నిండు మనసుతో కొలుచుకుంటారు. స్వామి వారి కొసం కొన్ని వందల కిలో మీటర్ల నుంచి వస్తుంటారు.పదుల సంఖ్యలో కంపార్ట్ మెంట్ లలో గంటల పాటు వెయిట్ చేస్తుంటారు.  

2 /5

ఇదిలా ఉండగా.. ప్రస్తుతంతిరుమలలో కొత్తగా టీటీడీ బోర్డుసైతం ఏర్పడింది. ఈ క్రమంలో తిరుమలలో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. అయితే.. తిరుమలలో కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా బైటికొచ్చినట్లు తెలుస్తొంది.

3 /5

 2021లో తిరుమల శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహం వేలు విరిగిపోయింది. అయితే అప్పటి టీటీడీ సిబ్బంది.. ఎవరు పట్టించుకోలేదు. ఈ ఘటన ఇటీవల బైటికొచ్చింది. అధికారులు, పండితులు మరమ్మత్తులు  చేయించి పూజలు చేయించారు.

4 /5

స్వామి వారి విగ్రహంవేలు విరిగిపోతే.. ఇన్నిఏళ్లపాటు పట్టించుకోరా.. అంటూ భక్తులు మండిపడుతున్నారు.  దీనిపై వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకొవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో తిరుమల అంశంపై మళ్లీ వివాదం రాజుకుందని చెప్పుకొవచ్చు.

5 /5

ఇదిలా ఉండగా.. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు.టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలన్నారు అంతే కాకుండా.. తిరుమలలో అన్యమత ప్రచారంవంటికి జరిగితే వదిలేదిలేదన్నారు.తిరుమలలో భక్తులకు ఎలాంటి లోటులేకుండా టీటీడీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది.