Gold News: పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఫిబ్రవరిలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు

Gold Rate: బంగారం ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగేందుకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర  భవిష్యత్తులో భారీ పెరుగుతుందా లేదా అనేది తెలియాల్సి  ఉంది.  కాగా వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా తెలుసుకుందాం. 
 

1 /7

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణం అంతర్జాతీయ పరిస్థితులే అని చెప్పవచ్చు. బంగారం ధరలు భారీ పెరిగేందుకు ప్రధానంగా జరుగుతున్న యుద్ద  వాతావరణమే ప్రధానంగా తెలుస్తోంది. రష్యా పైన మిస్సెల్స్ దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇచ్చింది.

2 /7

దీంతో ఒక్కసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణ సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు బంగారంవైపు మళ్లుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

3 /7

దీనికి తోడు ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు కూడా నెగెటివ్ గా స్పందించాయి. ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనం అయిన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణమని చెప్పవచ్చు.   

4 /7

అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారట్లు పది గ్రాములు ధర 80వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,800గా ఉంది. అయితే అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత బంగారం ధరలు తగ్గాయి.

5 /7

ఇంకా తగ్గుతుందని భావించిన పసిడి ప్రియులకు మరోసారి షాకిచ్చాయి. ఇప్పుడు మళ్లీ 80వేలకు పెరిగింది. దీంతో మరోసారి ఆల్ టైం రికార్డ్స్ అనే సందేహం వ్యక్తమవుతోంది. దీంతోబంగారం ప్రియులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపించడం లేదు.   

6 /7

అయితే ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ తోపాటు పండగల సీజన్ కూడా ముగిసింది. అయితే బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేసేవారు కూడా తగ్గుతున్నారు. ఇదిలా ఉంటే జనవరిలో బంగారం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

7 /7

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్టాక్ మార్కెట్లు పుంజుకుని ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.