Sobhita - Chaitu: నయనతారను ఫాలో అవుతున్న శోభితా- చైతు జోడి..?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ఇదే..

Nayanthara: నాగచైతన్య, శోభితా ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే. ఈ  క్రమంలో వీరి పెళ్లికోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

1 /6

శోభితా, నాగ చైతన్యల పెళ్లి వేడుక డిసెంబర్ 4న అన్నపూర్ణస్టూడియోస్ లో జరగనుంది. ఈ వేడుకకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఇరు కుటుంబాలు కూడా తమ అతిథుల లిస్ట్ ను ప్రిపేర్ చేసుకున్నారంట. అయితే.. కొద్ది మంది అతిథులను పిలిచే విధంగా నాగార్జున ప్లాన్ చేసుకున్నారంట.

2 /6

సింపుల్ గా, సంప్రదాయ బద్దంగా తన కొడుకు పెళ్లి జరగాలని కూడా నాగార్జున భావిస్తున్నారంట. ఈ క్రమంలో ప్రస్తుతం నాగాచైతన్య, శోభితల పెళ్లికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త ట్రెండింగ్ గా మారుతునే ఉంది.ఈ నేపథ్యంలో వీరి పెళ్లి గురించి మరో అప్ డేట్ ప్రస్తుతం  నెట్టింట చక్కర్లు కొడుతుంది.

3 /6

చైతు, శోభితల పెళ్లిని డ్యాక్యుమెంటరీ రూపంలో తమ అభిమానుల ముందు ఉంచాలని కొత్త జంట ప్లాన్ లు చేస్తున్నారంట. దీని కోసం ఇప్పటికే ఓటీటీ, నెట్ ఫ్లిక్స్ లు ముందుకు వచ్చాయంట.తమ ప్రేమ ఎలా మొదలైంది..లైఫ్ జర్నీలు, పర్సనల్ గా ఎదుర్కొన్న సవాళ్లు దీనిలో ఉంటాయని తెలుస్తొంది.  

4 /6

ఇదిలా ఉండగా.. ఇప్పటికే నాయన తార విఘ్నేశ్ శివన్ తో పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే.  నయన తార: బియాండ్ ది ఫెయిరీ టెల్ గా ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ల్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. 

5 /6

ఈ క్రమంలో శోభిత, చైతు జంత.. నయన తారను ఫాలో అవుతున్నారంటూ కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట.  మరీ దీనిలో ఎంత నిజముందొ తెలియాల్సి ఉంది. మరోవైపు.. అన్న పూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ఉంది. అక్కడ పెళ్లి జరిగితే.. తమ ఇంటి పెద్ద ఆశీస్సులు తమకు ఉంటాయని కూడా నాగార్జున కుటుంబం భావిస్తున్నారంట.  

6 /6

మరోవైపు చైతు సైతం..తనకు కాబోయే భార్యగురించి మాట్లాడుతూ.. శోభితతో  చాలా కనెక్ట్ అయ్యాయని, తన వచ్చాక లైఫ్ లో వెల్తీ పోయిందని కూడా కామెంట్లు చేశారు. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశతో ఎదురు చూస్తున్నానని కూడా చైతు చేప్పిన విషయం తెలిసిందే.