PM Kisan: పీఎం కిసాన్‌ యోజనకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మీరు ఎంత నష్టపోతారు తెలుసా?

PM Kisan 19Th Installment: మన దేశంలో సగం జనాభాకు పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు కూడా అందిస్తున్నాయి. ఇందులో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన. ఈ పథకానికి మీరూ దరఖాస్తు చేసుకున్నారా?
 

1 /7

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూత అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏడాది రూ.6000 వారి ఖాతాల్లో ఈ పథకం ద్వారా డబ్బులు జమా చేస్తుంది.  

2 /7

మొత్తం మూడు విడుతల్లో ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 జమా చేస్తుంది. ఈ పథకం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2019లో ప్రారంభమైంది.  

3 /7

అయితే, ఈ పథకంలో డబ్బులు పొందాలంటే ముందుగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజనకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. మీరు కూడా ఇప్పటి వరకు ఈ పథకానికి అప్లై చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేయండి.  

4 /7

ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో మీ పేరు నమోదు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.  

5 /7

ఈ వెబ్‌సైట్‌తో లాగిన్‌ అయిన తర్వాత 'Farmer Corner' ఆప్షన్‌ లో 'New Farmer' ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి మీ మొబైల్‌ నంబర్‌ కూడా నమోదు చేయాలి.   

6 /7

అప్పుడు మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీ ఇతర వివరాలు కూడా నమోదు చేయాలి. మీ భూమికి సంబంధించిన పత్రాలు అప్లోడ్ చేయాల్సి  ఉంటుంది. అవన్ని నమోదు చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్‌ పూర్తి అయినట్లే.  

7 /7

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ వద్ద ఓటర్‌ ఐడీ, ల్యాండ్ రికార్డు, ఫోటో, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్‌ నంబర్‌ కలిగి ఉండాలి. కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి. మీ స్టేటస్‌ చెక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.