SC Reservations: దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా చేర్చినవే. హిందూమతంలో అణగారిన కులాలకు వర్తించే రిజర్వేషన్ ఇది. ఈ రిజర్వేషన్ల విషయంలో చాలాకాలంగా ఉన్న సందేహాలు, విమర్శలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాధానం ఇచ్చినట్టయింది. సుప్రీంకోర్టు తీర్పు సంచలనంగా మారింది.
ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ కోసం క్రైస్తవ మతం ఆచరిస్తున్న ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరో మతం ఆచరిస్తూ కేవలం రిజర్వేషన్ లబ్ది కోసం హిందూవుగా పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఇది పూర్తిగా భారత రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేసింది. క్రైస్తవంలో మారిన ఓ మహిళకు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్‌ను గతంలో మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. అంతేకాకుండా కేవలం ఉద్యోగ ప్రయోజనాలకై రిజర్వేషన్ పొందేందుకు హిందూవునని చెప్పడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవ్‌ల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం మతం మారితే అనుమతించేది లేదని కోర్టు తెలిపింది. అలాంటి ఉద్దేశ్యాలు ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్పూర్తికే విరుద్ధమని వెల్లడించింది. పిటీషనల్ క్రైస్తవ మతం ఆచరిస్తున్నట్టు, చర్చికి వెళ్తున్నట్టు సాక్ష్యాలతో నిర్ధారణయిందని సుప్రీంకోర్టు తెలిపింది. అదే సమయంలో తాను హిందూ మతంలో మారినట్టుగా పిటీషనర్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని స్పష్టం చేసింది.
ఈ కేసు హిందూ తండ్రికి, క్రైస్తవ తల్లికి జన్మించిన ఓ మహిళకు సంబంధించింది. 2015లో ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం తాను హిందూవునని తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని ఎస్సీ రిజర్వేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా స్థానిక యంత్రాంగం తిరస్కరించింది. దాంతో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడామెకు వ్యతిరేక తీర్పు వచ్చింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం ఆమె చర్యను తీవ్రంగా ఖండించింది. రిజర్వేషన్ కోసం హిందూవునని చెబితే కుదరదని వెల్లడించింది.
Also read: Banks Transfer Policy: ఉద్యోగులకు శుభవార్త, ఇక బదిలీ ప్రక్రియ అంతా ఆటోమేటిక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.