Tirumala Photoshoot: ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధాన ఆలయం ముందు రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పెద్ద పెద్ద కెమెరాలతో ఫొటోషూట్ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. పవిత్రమైన ఆలయాన్ని తమ ఎలివేషన్ కోసం వినియోగించుకోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార తెలుగుదేశం పార్టీతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు కలిసి ఈ వ్యవహారంలో పాల్గొనడం కలకలం రేపింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఇది చదవండి: Red Sandalwood: 'పుష్ప'ను మించి ఎర్రచందనం స్మగ్లింగ్.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఎంపీకి సమీప బంధువులు హల్‌చల్ చేశారు. ఎంపీ బంధువులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం గురువారం ఆలయం వెలుపల ఫొటోషూట్ చేయించుకున్నారు. నలుగురి ఫొటోగ్రాఫర్లు వీడియోలు.. ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. అక్కడ నానా హంగామా చేశారు. కొన్ని నిమిషాల పాటు తిరుమల ఆలయం ముందు ఫొటోషూట్‌తో హడావుడి చేశారు.
ఇది చదవండి: Sarada Peetham: సీఎం చంద్రబాబు దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌ను వీడిన స్వామిజీ? ఎవరో తెలుసా?
స్వామి వారి ఆలయం ముందు మీడియాపై ఆంక్షలు విధించే టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడ చడీచప్పుడు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోషూట్ వలన భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని ఆలయాన్ని తనివితీరా చూద్దామనుకున్న వారికి ఆ నాయకుడి అనుమాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏమీ చేస్తుందని భక్తులు నిలదీస్తున్నారు.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వంశీనాథ్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా తిరుమలలో ప్రొటోకాల్ మర్యాదలతో దర్శనం చేసుకున్నారని తెలుస్తోంది. వంశీనాథ్ రెడ్డి వ్యవహారం అటు తిరుమల... ఇటు కడపలో చర్చనీయాంశమైంది. కడపలో కీలక తెదేపా నేతలు వంశీనాథ్ రెడ్డితో హల్చల్ చేయడంతో ఆ ఫొటోలను కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. శ్రీవారి దర్శనానికి వెళ్లడం.. ఆ తర్వాత వేద ఆశీర్వచనం పొందడంతోపాటు తన అనుచరులకు చేయించడం వెనక హస్తం ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.