School Holiday: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఈరోజు స్కూళ్లు బంద్‌..!

School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించి తీపికబురు అందించింది. స్కూళ్లకు సెలవు వస్తే విద్యార్థులకు పండగే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కూడా కురిసాయి. అయితే, ఫెంగల్‌ తుఫాను ప్రభావం ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, తెలంగాణలో కూడా ఉంటుంది.  

2 /7

ఈ ఫెంగల్‌ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై పరిసర ప్రాంతంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. గత  కొన్ని రోజులుగా చెన్నైలో భారీ వర్షాలు, వరదలు కూడా వస్తున్నాయి.  

3 /7

ముఖ్యంగా తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, కడులూరు, విల్లుపురం వంటి జిల్లాలు ఈ తుఫాను ధాటికి తీవ్ర ప్రభావితం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని విద్యా సంస్థలలకు సెలవులు ప్రకటించాయి.  

4 /7

ముఖ్యంగా నేడు కూడా పుదుచ్చేరిలోని అన్నీ స్కూళ్లుకు సెలవు ఇచ్చారు. ఈ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాడుతున్నాయి.  

5 /7

ఏపీలోని తీరప్రాంతాలు కూడా ప్రభావితం చెందాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ నుంచి బంగాళాఖాతంలోని అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. వరదలు కూడా ఇళ్లలోకి వచ్చి చేరాయి. ఆయా ప్రాంతాల అనుగుణంగా విద్యార్థులకు సెలవులు కూడా ప్రకటించారు.  

6 /7

ఆ తర్వాత అక్టోబర్‌ నెలలో దసరా సెలవులు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఇక దీపావళి సెలవులు కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవుల్లో కుదింపు ఉందని తెలుస్తోంది.  

7 /7

ముఖ్యంగా పదోతరగతి చదివే విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నేపథ్యంలో కేవలం మూడు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు రానున్నాయి. సాధారణంగా అయితే, సంక్రాంతి అంటే ఓ వారం రోజులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు ఇచ్చేవారు.