School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్ గుడ్‌న్యూస్ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. అవును ఈ నెలలో వరుసగా విద్యార్థులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గత కొద్ది రోజులుగా స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. కొన్ని రోజులు భారీవర్షాలు వరదల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా దాదాపు 13 రోజులపాటు స్కూళ్లకు సెలవులు వచ్చాయి.
ఆ తర్వాత దీపావళి సందర్భంగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్‌నెలలో అల్పపీడనాలు, భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
అయితే నవంబర్ నెలలో కూడా వరుసగా స్కూళ్లకు మూడు రోజులు వచ్చాయి. గురునానక్ జయంతి, రెండో శనివారం, ఆదివారం కూడా కలిసి వచ్చాయి. తాజాగా డిసెంబర్ నెలలో కూడా వరుసగా సెలవులు వచ్చాయి.
దీంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ ఈవ్ సందర్భంగా సెలవు ఇచ్చింది. ఇక మరుసటి రోజుల క్రిస్మస్, 26వ తేదీ బాక్సింగ్ డే సందర్భంగా సెలవు
వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సెలవులు స్కూళ్లతోపాటు కాలేజీలకు వర్తించే అవకాశం ఉంది. ఈరోజుల్లో కేవలం మన రాష్ట్రంలోనే మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ స్కూళ్లకు సెలవులు ఉంటాయి.
క్రిస్మస్ రోజు క్రిస్టియన్లు ఇంటిని అలంకరించుకుంటారు. క్రిస్మస్ చెట్టు పెట్టుకుంటారు. అంతేకాదు ప్రార్ధనలు కూడా చేస్తారు. ఇంటి బయట క్రిస్మస్ స్టార్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటారు.
ఇల్లు, బయట లైట్లతో అలంకరించుకుంటారు. చర్చీలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో క్రిస్మస్ను జరుపుకొంటారు. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ వస్తుంది. ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. క్రిస్మస్ శాంటక్లాజ్ ప్రత్యేకం.
అయితే, కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఏకంగా 5 రోజులు కూడా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నాయి. గత ఏడాది కూడా ఐదు రోజులు సెలవులు ఇచ్చాయి. ఏదేమైనా మరోసారి స్కూళ్లకు సెలవు రావడంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు.