Immunity Drinks: చలికాలం అంటేనే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. శీతాకాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. అందుకే ఇన్ఫెక్షన్స్ చాలా సులభంగా సోకుతుంటాయి. ముఖ్యంగా గొంతు గరగర, జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాయి. అయితే ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే ఇమ్యూనిటీ బలోపేతం చేసుకోవడం ద్వారా వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.
గ్రీన్ టీ అండ్ లెమన్ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ డ్రింక్ శరీరాన్ని అద్భుతంగా డీటాక్స్ చేస్తుంది.
కాడా చలికాలంలో కాడా అనేది మంచి ప్రత్యామ్నాయం. దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం, తులసి, తేనె అవసరమౌతాయి. ఈ డ్రింక్ శరీరానికి వేడి అందిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను దూరం చేస్తుంది
ఉసిరి జ్యూస్ విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్ధమిది. శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనిటీ పెంచే గుణాలుంటాయి. చలికాలంలో రోజూ ఉదయం పరగడుపున ఉసిరి జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది.
అల్లం తులసి టీ అల్లం తులసిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జలుబు దగ్గు నుంచి కాపాడుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అల్లం తులసి టీ తాగితే గొంతు గరగర దూరమౌతుంది. ఇమ్యూనిటీ దూరమౌతుంది. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు దోహదం చేస్తుంది. రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితాలుంటాయి
పసుపు పాలు పసుపులో ఉంటే కర్క్యూమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉంటుంది. వేడి నీటిలో పసుపు కలిపి తాగడం వల్ల గొంతు గరగర, జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితాలుంటాయి.