Real Estate in Hyderabad: హైదరాబాద్ నగరం వేగంగా డెవలప్ అవుతోంది. నగరానికి నలువైపులా డెవలప్ మెంట్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ధరల తగ్గింపుతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి మంచి అవకాశమని చెప్పువచ్చు.
Real Estate in Hyderabad: గండిమైసమ్మ..భక్తుల కోరికలు తీర్చే గ్రామదేవతగా పూజిస్తుంటారు. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్య తరగతి సొంతింటి కలనూ కూడా తీరుస్తోంది. అరగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్ కు చేరుకునే వీలు, శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ కూడా ఉంది. సమీపంలోనూ అంతర్జాతీయ విద్య, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు కూడా అందుబాటులో ఇండ్ల ధరలు ఉండటంతో బహదూర్ పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
నీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్లు..డెవలప్ మెంట్ కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలవైపే విస్తరిస్తోంది. దీనికి సరైన ఉదాహరణ బహదూర్ పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్ కు చేరువలోనే ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో డెవలప్ చెందాయి. దీంతో ఇక్క పెద్దెత్తున నివాస, వాణిజ్య సముదాయాలు కూడా వెలిశాయి. ఇప్పుడా డెవలప్ మెంట్ బాచుపల్లికి కొనసాగింపుగా, బహదూర్ పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించి ఉంది. అన్నింటికీ మించి తక్కువ ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తుందని చెప్పవచ్చు.
మెరగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు సులవుగా చేరుకునే విధంగా ఉండటంతో బహదూర్ పల్లి, గండిమైసమ్మ ఏరియాలకు ఇది ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగటంలోనే బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయూకి అక్కడి నుంచి హైటెక్ సిటీ కూడా వెళ్లవచ్చు.
ఇప్పటికే మియాపూర్, బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉందని చెప్పవచ్చు. ఇది పూర్తయినట్లయితే ప్రయాణం మరింత తగ్గుతుంది. అలాగే 1.5కిలోమీటర్ల దూరంలోని దుండిగల్ ఔటర్ ఎగ్జిట్ 5 ఎక్కితే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సులభంగా చేరుకోవచ్చు.
ఇక ఉపాధిపరంగానూ ఐటీ కారిడార్కు సులువుగా చేరుకోవడంతోపాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీలు పరిశోధన, డెవలప్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్ పల్లి ఐటీ పార్కులు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్ అకాడమీలు ఉన్నాయి. పచ్చదనంతోపాటు ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత ఇండ్ల ఉండటం కూడా ఈ ప్రాంతాల ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఇక ఇక్కడ ఇండ్ల ధరలు అందరికీ అందుబాటులోనే ఉణ్నాయి. బహదూర్ పల్లి, బాసుర్ గడి, గౌడవెల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాలలో అపార్ట్ మెంట్లు, విల్లా ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి.
ప్రైమార్క్, రూబ్రిక్ కన్ స్ట్రక్షన్స్, వాసవి ప్రణీత్ గ్రూప్, అపర్టా వంటి సంస్థలు పెద్దెత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.5,500 వేలు ఉంది. ప్రాజెక్టులలోని వసతులు విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.