Winter Skin Care: చలి పెరిగినా అందంగా కనిపించడం ఇలా.. చలికాలం సౌందర్య చిట్కాలు

Follow These Tips For Winter Skin Care: చలికాలం చర్మం పొడిబారుతుంది. ముఖం.. శరీరం మొత్తం తెల్లగా మారి కళావిహీనంగా కనిపిస్తుంటుంది. అలా అయిన పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఇంట్లోని వస్తువులతోనే చలికాలంలో నిగనిగలా మెరవచ్చు. చలికాలం సౌందర్య చిట్కాలు తెలుసుకోండి.

1 /8

పెరుగుతున్న చలి: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది.

2 /8

చర్మం పొడిబారడం: చలికాలంలో చర్మం పొడి బారి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే మెరిసిపోతారు.

3 /8

తలస్నానం ఇలా: శనగపిండితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా మృదువుగా మారుతుంది.

4 /8

నూనెలు: కొబ్బరినూనెను బాగా మరిగించి శెనగపిండిని కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.

5 /8

పెదవులు: చలికాలంలో పెదవులు పగిలిపోవడం ఒక సాధారణ సమస్య. దీని నివారణకు ఇంట్లో ఉండే ఆవు వెన్న లేదా నెయ్యిని ఉదయం, రాత్రి పూయాలి. పెదవులు పగలడం తగ్గుతుంది.

6 /8

ఆహారం: చలికాలంలో వాల్ నట్స్ , బాదం, బొప్పాయి పండు, క్యారెట్ , చేపలు తింటే చర్మానికి అవసరమైన విటమిన్లు సహజసిద్ధంగా శరీరానికి అందుతాయి.

7 /8

కొబ్బరి నీళ్లు: కొబ్బరి పాలను స్నానం చేసేటప్పుడు చర్మానికి పట్టిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. మీరు ప్రయత్నించి చూడండి.

8 /8

గమనిక: ఈ సమాచారం అవగాహన కల్పించడం కోసం మాత్రమే అందిస్తున్నది. ఇది జీ తెలుగు న్యూస్‌ ధ్రువీకరించడం లేదు.