Vishal Mega Mart-Mobikwik IPO Listing: స్టాక్ మార్కెట్లోకి విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ షేర్లు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అదిరిపోయే ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి.
Vishal Mega Mart-Mobikwik IPO Listing: దేశవ్యాప్తంగా సూపర్ మార్ట్ లను నిర్వహిస్తున్న విశాఖ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ ఈరోజు దలాల్ స్ట్రీట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు దాని IPO ధర రూ. 279 నుండి 58 శాతం కంటే ఎక్కువ జంప్‌తో లిస్ట్ అయ్యింది. కంపెనీ షేర్లు బిఎస్ఇలో 58.51 శాతం పెరిగి రూ.442.25 వద్ద లిస్టయ్యాయి. తర్వాత 87.81 శాతం పెరిగి రూ.524కి చేరింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 57.70 శాతం జంప్‌తో రూ.440 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,435.68 కోట్లుగా ఉంది. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ IPO బిడ్డింగ్ చివరి రోజు శుక్రవారం 119.38 సార్లు సభ్యత్వం పొందింది. కంపెనీ రూ.572 కోట్ల ఐపీఓలో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.265-279గా ఉంది.
ఇక విశాల్ మెగామార్ట్ ఐపీఓ షేర్లను ఈరోజు మార్కెట్లో నమోదు అయ్యాయి. ఎస్ఎస్ఈలో రూ. 104 వద్ద షేర్లు ప్రారంభం అయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ. 78 తో పోలిస్తే 33.33శాతం ప్రీమియంతో ఈ షేర్లు లిస్టయ్యాయి. రూ. 8వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.
8000 కోట్ల రూపాయల ఈ ఇష్యూ 2024 సంవత్సరంలో నాల్గవ అతిపెద్ద IPO.విశాల్ మెగా మార్ట్ IPO పూర్తిగా OFS (ఆఫర్ ఫర్ సేల్) అయినప్పటికీ పెట్టుబడిదారుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా క్యూఐబి కేటగిరీ ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనబరిచి 85 సార్లు కంటే ఎక్కువ వేలం వేశారు. అయితే, OFSకి సంబంధించిన ఆందోళనల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుండి ఆసక్తి తక్కువగా ఉంది.
భారతదేశంలో పెరుగుతున్న మధ్యతరగతి, దిగువ-మధ్యతరగతి ఆదాయ సమూహం అవసరాలను తీర్చడంపై కంపెనీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. వ్యూహాత్మకంగా చొచ్చుకుపోని మార్కెట్లపై దృష్టి సారించింది. కంపెనీ తన వ్యాపార నమూనా సామర్థ్యంతో కస్టమర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది.కంపెనీ షేర్లు 20-25% ప్రీమియంతో లిస్ట్ అవుతాయని నిపుణులు అంచనా వేశారు.
కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,168.01 కోట్లు. FY24లో, కంపెనీ సంవత్సరానికి 17.41% ఆదాయ వృద్ధిని సాధించింది. అయితే పన్ను తర్వాత లాభం 43.78% పెరిగింది.రిటైల్ రంగంలో విశాల్ మెగా మార్ట్ దూసుకుపోతుంది. 2024 సెప్టెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 645 స్టోర్లు, 414 నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించింది.
ఇక ఫిన్ టెక్ సంస్థ వన్ మొబిక్విక్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. రూ. 442.25వద్ద స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. లిస్టింగ్ ధర రూ. 279తో పోలిస్తే ఏకంగా 58.51 శాతం ప్రీమియంతో దూసుకెళ్లాయి. మొబిక్విక్ సబ్ స్క్రిప్షన్ తొలిరోజూ మంచి ఆదరణ పొందింది.
తొలి గంటలోనే పూర్తి సబ్ స్క్రిప్షన్ సంపాదించుకుంది. ఇక చివరి రోజు ఏకంగా 119. 38 రెట్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ కాగా..ఐపీఓలో భాగంగా మొత్తం 1.18 కోట్ల షేర్లు జారీ చేయాలని నిర్ణయించుకుంది. రూ. 572 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణినిన కంపెనీ రూ. 265-279గా నిర్ణయించింది.