Revanth Davos Tour: ప్రపంచ నగర ప్రమాణాలతో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదికపై వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను, ఫ్యూచర్ సిటీ సమగ్రాభివృద్ధికి పారిశ్రమిక ప్రణాళిక, మౌలిక సదుపాయాలకల్పన పెట్టుబడులకు అనువుగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.
Revanth Davos Tour: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ లో ప్రతి జులై నెలలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల సాధనతో ఒప్పందాలు చేసుకునేందుకే గాకుండా.. రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించబోతున్నామని తెలిపారు.
AP Investments: ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరంలో భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్క ఏడాదిలో వచ్చిన పెట్టుబడులతో 8 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగాలని.. పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేయాలని ఆదేశించారు.
Chandrababu Announces Rs 8 Point 55 Lakh Crore Investments In 2025: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జాతర కొనసాగుతోందని.. ఇప్పటివరకు రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 8 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Investment Schemes: ఫిక్స్‌డ్ డిపాజిట్లకే పరిమితమై ఉంటే మీ సంపద నెమ్మదిగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో.. బ్యాంక్ ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ అసలైన లాభాన్ని అందించలేకపోతోంది. అందుకే ఇప్పుడు తెలివైన పెట్టుబడిదారులు సంప్రదాయ మార్గాల నుంచి బయటకు వచ్చి, భద్రతతో పాటు మెరుగైన రాబడి ఇచ్చే ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల వైపు దృష్టి పెడుతున్నారు. సరైన చోట పెట్టుబడి పెట్టగలిగితే.. స్థిరమైన ఆదాయం మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించే అవకాశం కూడా ఉంటుంది.
Telangana Attracts Rs 5 Lakh Crore Investments: గ్లోబల్ సమ్మిట పేరిట నిర్వహిస్తున్న సదస్సులో తెలంగాణ ఊహించని రీతిలో పెట్టుబడులను ఆకర్షించింది. రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ప్రభుత్వం పొందింది. పెట్టుబడుల జాతరకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Stocks To Buy: దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీలకు చెందిన ఐదు స్టాక్స్‌కు బై రేటింగ్ ఇచ్చి, ఆకర్షణీయమైన టార్గెట్ ప్రైజులు సూచించాయి. అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్స్, లోథా డెవలపర్స్, వీ వర్క్ ఇండియా, హిందూస్తాన్ కాపర్, 360 వన్ వామ్ స్టాక్స్‌లో 40–70శాతం వరకు లాభాల అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
Defence stocks future: డిఫెన్స్ స్టాక్స్ గత కొన్ని నెలలుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతకుముందు భారీ ర్యాలీ చేశాయి. ట్రంప్ టారిఫ్స్ ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ సెక్టార్ పై ప్రభావం ఎలా ఉంటుందో అనే ఆందోళన పెట్టుబడిదారుల్లో నెలకొంది. అయితే డిఫెన్స్ సెక్టార్ భవిష్యత్తు చాలా పాజిటివ్ గా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని డిఫెన్స్ స్టాక్స్ మంచి వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
Andhra Pradesh Targets Rs One Lakh Crore Investments With Aerospace And Defence Policy: ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయగా.. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం విధించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Telangana Get Investments Rs 2125 Crore: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. పలు సంస్థలు మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. ఆ పెట్టుబడులతో 5 వేల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
KTR Sensational Comments With NRIs At Foreign Tour: ఎక్కడకు వెళ్లినా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
Investment Tips: ధనవంతులు కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటే కోటీశ్వరులు అవ్వడం చాలా ఈజీ. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
CM Chandrababu Approves 9 Projects Worth Of 1 Lakh 82k Crores Of Investments: ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టగా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Investment 2025: ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అంచనాల ప్రకారం..2025లో ఏది బెస్ట్ పెట్టుబడి ఎంపిక అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిదారులకు 2024లో లభించిన లాభాలు 2025లో బంగారం, వెండి నుంచి లభించవని కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.
Vishal Mega Mart-Mobikwik IPO Listing: స్టాక్ మార్కెట్లోకి విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ షేర్లు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. అదిరిపోయే ప్రీమియంతో లిస్ట్ అయిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. లిస్టింగ్ తొలిరోజే తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించాయి.
Ponguleti Srinivasa Reddy Hate Comments On Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ వెళ్తారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.
Savings Plan: మీరు ఉద్యోగుస్తులా? మీ జీతం మొత్తం ఖర్చయిపోతుందా? అందులో ఎంత పొదుపు చేయాలో మీకు తెలియడం లేదా. అందుకే పొదుపు, పెట్టుబడులపై ద్రుష్టిపెట్టాలి. మరి ఎలా అనే మీకు సందేహం రావచ్చు. ఈ 50/30/20 రూల్ పాటిస్తే మీరు బోలెడంత డబ్బు పొదుపు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇదేలాగో చూద్దాం.
Post Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ స్కీం గురించి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.