EPFO News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పీఎఫ్‌ లిమిట్ ఒకేసారి భారీగా పెంపు..?

PF Wage Ceiling Hike: కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ శాఖల తమ డిమాండ్లను ఆర్థిక శాఖ ముందు ఉంచుతున్నాయి. ఫిబ్రవరి 1, 2025న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌న సమర్పించనున్నారు. ఈసారి ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా తీపికబురు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేయనుందని నిపుణులు చెబుతున్నారు.
 

1 /8

ఈసారి బడ్జెట్‌లో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) శాలరీ లిమిట్‌ను (జీతం సీలింగ్ పరిమితి) పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈపీఎఫ్ లిమిట్‌ను చివరగా 2014లో మార్చారు. అప్పుడు రూ.6500 నుంచి రూ.15 వేలకు పెంచారు.  

2 /8

ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వేతన పరిమితిని మార్చడానికి ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు.   

3 /8

రూ.15 వేల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు కచ్చితంగా ఈపీఎఫ్‌ను ఎంచుకోవాల్సిందే. పరిమితిని పెంచితే.. ఎక్కువ మంది సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్‌ స్కీమ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి.  

4 /8

వేతన పరిమితిని నేరుగా పెంచితే.. ఈపీఎఫ్ ఖాతా, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అవుతుంది. ఉద్యోగి వాటాతోపాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది.   

5 /8

దీంతో లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంది. లిమిట్‌ను పెంచితే.. ప్రభుత్వం, ప్రైవేట్ రంగంపై ఆర్థిక భారం పడుతుంది.   

6 /8

ఒక కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే.. కచ్చితంగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోవాలి. బేసిక్ జీతం, అలవెన్స్‌లతో కలిపి రూ.15 వేలు జీతం తీసుకునే ఉద్యోగులు కచ్చితంగా 12 శాతం ఈపీఎఫ్‌కు చెల్లించాలి. యజమాని కూడా 12 శాతం కాంట్రిబ్యూట్ చేయాలి.  

7 /8

ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్‌కు వెళుతుంది. కంపెనీ వాటా నుంచి 3.67 శాతం ఈపీఎఫ్‌కు, 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో జమ అవుతుంది.   

8 /8

ప్రావిడెంట్ ఫండ్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగుల కోసం ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్, ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బోర్డుతో సమన్వయంతో పనిచేస్తోంది.