YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
తల్లి విజయమ్మ, వైఎస్ జగన్, భారతి కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పాస్టర్ సందేశం వినిపించారు. అనంతరం బైబిల్లోని కొన్ని వ్యాఖ్యలు వినిపించారు.
అనంతరం చర్చిలో కేక్ కట్ చేశారు. హాజరైన శ్రీమతి వైయస్ విజయమ్మ గారు, శ్రీమతి వైయస్ భారతి గారు, ఇతర కుటుంబ సభ్యులు.
కడప జిల్లా పర్యటనలో పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ విజయమ్మతో కలిసి పాల్గొన్నారు.
తల్లి చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం జగన్ను దగ్గరకు తీసుకుని తల్లి విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు.
చర్చికి చేరుకున్న జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్, విజయమ్మ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ను జగన్ ఆవిష్కరించారు. గురు, శుక్రవారం కూడా కడప జిల్లాలో పర్యటించనున్నారు.