School Holidays: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. సెలవులు పొడగింపు ఎప్పటి వరకు అంటే..?

Christmas School Holidays Extended: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌ స్కూళ్లకు మరికొన్ని రోజులు పొడగించారు. ఇప్పటికే స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు ఉన్నాయి. అయితే, మరికొన్ని రోజులు ఆ సెలవులను పొడగించాయి స్కూళ్లు. దీంతో స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులు అదనంగా వచ్చాయి.  ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /7

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీ చదువుకునే విద్యార్థులు క్రిస్మస్ సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. త్వరలో కొత్త సంవత్సరం వేడుకలు కూడా నిర్వహించనున్నారు.  

2 /7

డిసెంబర్ 23వ తేదీ నుంచి క్రిస్మస్‌ సెలవులు అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. డిసెంబర్‌ 26వ తేదీ వరకు వర్తిస్తుంది. అంటే మొత్తంగా మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి.  

3 /7

అయితే, తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్‌ మైనారిటీ స్కూళ్లు, కాలేజీలకు మాత్రం మరికొన్ని రోజులు సెలవులు పొడగించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు 29 వరకు పొడగించారు. ఇక తెలంగాణలో సాధారణంగా 27 వరకు ఇచ్చారు.  

4 /7

కానీ, క్రిస్టియన్‌ మైనారిటీ స్కూళ్లకు మాత్రం జనవరి 1వ తేదీ వరకు తెలంగాణలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. దీంతో జనవరి 2వ తేదీ స్కూళ్లు రీఓపెన్‌ అవుతున్నాయి.  అంటే 2025 జనవరి 2వ తేదీన స్కూళ్లు ఓపెన్‌ అవుతాయి.  

5 /7

స్కూళ్లకు ఇప్పటికే సెలవులు బాగానే వచ్చాయి. అయితే, క్రిస్మస్‌ సెలవులు సాధారణంగా రెండు రోజులు గతంలో ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో మూడు రోజులు చేశారు. క్రిస్టియన్‌ మైనారిటీ స్కూళ్లకు మాత్రం వారం రోజులు ఇచ్చేవారు.  

6 /7

ఇదిలా ఉండగా దసరా, దీపావళి పండుగలకు కూడా వరుసగా స్కూళ్లకు సెలవులు వచ్చాయి. దసరా సెలవులు అయితే, ఏకంగా 13 రోజులు ఇచ్చారు. ఇక దీపావళి సెలవులు రెండు రోజులు ఇచ్చారు. ఇవి కాకుండా భారీ వర్షం, వరదల నేపథ్యంలో కూడా స్కూళ్లకు సెలవులు వచ్చాయి.  

7 /7

అయితే, సంక్రాంతి పండుగకు స్కూళ్లకు సెలవులు విషయంలో మార్పు చేశారు. ఆ సెలవులను కుదించారు. మార్చి నెలలోనే ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి స్కూలు సెలవులు మాత్రం తగ్గించారు. కేవలం మూడు రోజులు మాత్రమే స్కూళ్లకు సెలవు ఇచ్చారు.