YS Jagan: వైఎస్ జగన్‌కు ముద్దు ఇచ్చిన విజయమ్మ.. క్రిస్మస్ వేడుకల ఫొటో వైరల్

YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

1 /9

పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి.

2 /9

తల్లి విజయమ్మ, వైఎస్ జగన్, భారతి కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

3 /9

పాస్టర్‌ సందేశం వినిపించారు. అనంతరం బైబిల్‌లోని కొన్ని వ్యాఖ్యలు వినిపించారు.

4 /9

అనంతరం చర్చిలో కేక్‌ కట్‌ చేశారు. హాజరైన శ్రీమతి వైయస్‌ విజయమ్మ గారు, శ్రీమతి వైయస్‌ భారతి గారు, ఇతర కుటుంబ సభ్యులు.

5 /9

క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో వైఎస్ విజ‌య‌మ్మ‌తో క‌లిసి పాల్గొన్నారు.

6 /9

త‌ల్లి చేయి ప‌ట్టుకుని కేక్ క‌ట్ చేయించారు. అనంతరం జగన్‌ను ద‌గ్గ‌రకు తీసుకుని త‌ల్లి విజ‌య‌మ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. 

7 /9

చ‌ర్చికి చేరుకున్న జ‌గ‌న్‌కు పార్టీ నాయకు‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

8 /9

ఇడుపుల‌పాయ ప్రేయ‌ర్‌ హాల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌, విజ‌య‌మ్మ‌ కుటుంబస‌భ్యులు కూడా పాల్గొన్నారు.

9 /9

క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా కొత్త‌ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. గురు, శుక్ర‌వారం కూడా క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.