Video Viral: వావ్.. లబ్దిదారుడి ఇంట్లో కాఫీ పెట్టిన దేశంలోనే రిచ్చెస్ట్ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్..

Ntr bharosa pension distribution in ap:  చంద్రబాబు నాయుడు  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 31, 2024, 03:46 PM IST
  • లబ్దిదారుడి ఇంట్లో కాఫీ పెట్టిన చంద్రబాబు..
  • ఆనందంతో మురిసిపోతున్న ప్రజలు..
Video Viral: వావ్.. లబ్దిదారుడి ఇంట్లో కాఫీ పెట్టిన దేశంలోనే రిచ్చెస్ట్ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్..

Chandrababu naidu ntr bharosa pension distribution:  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు ప్రజలకు డెవ లప్ మెంట్ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది.  ఒకవైపు ఏపీని గాడిన పెట్టే పనులు చేస్తునే.. మరోవైపు గత పాలకులు చేసిన పనుల్ని కూడా ఎండగడుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ప్రతి నెల మొదటి తారీఖు లోపల పెన్షన్ లను ఠంచన్ గా అందేలా చర్యలు చేపట్టారు.

 చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సైతం.. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినేందుకు ఇటీవల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఏపీలో పెన్షన్ ల పంపిణిని మాత్రం చంద్రబాబు సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం.

 

చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు పర్యాయాలు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ల పంపిణి కార్యక్రమంను చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, పెన్షన్ ల పంపిణిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.

చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా యలమందల లో ఏడుకొండలు అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అక్కడ పెన్షన్ పంపిణిని నిర్వహించారు. అదేవిధంగా అక్కడ సీఎం చంద్రబాబు స్వయంగా కాఫీ పెట్టినట్లు తెలుస్తొంది. అదే విధంగా పలువురు లబ్దిదారులతో ముచ్చటిస్తు చంద్రబాబు వారి సమస్యల్ని అడిగిమరీ తెలుసుకున్నారు. ఈ పెన్షన్ ల పంపిణికి చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more: Andhra Pradesh Free Bus Scheme: ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు..

అయితే.. దేశంలోనే రిచ్చెస్ట్  సీఎంగా ఉన్నప్పటికి , ఒక పెదవాడి ఇంట్లో వెళ్లి కాఫీ పెట్టిన ఘనత చంద్రన్నకు మాత్రమే దక్కిందని కూడా టీడీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారంట. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News