Prayagraj Kumbh Mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు బయలు దేరిన తిరుమల శ్రీవారి కళ్యాణ రథం..

Tirumala kalyanaratham: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు శ్రీవారి కళ్యాణ రథం బయలు దేరినట్లు తెలుస్తొంది.
 

1 /6

ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ క్రమంలో కోట్లాది మంది ఈసారి కుంభమేళ ఉత్సవానికి వస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు.

2 /6

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ ఉత్సవాలు జరగనున్నాయి. అదే విధంగా ప్రస్తుతం దీనిపై భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో తిరుమల నుంచి ఉత్తర ప్రదేశ్ కు రథం బయలు దేరినట్లు తెలుస్తొంది.  

3 /6

ఈ నేపథ్యంలో.. టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించించారు. కుంభమేళకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం అయ్యేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తొంది.  

4 /6

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దీనిపై మాట్లాడారు.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  

5 /6

ఈ ఆలయం నమునాకు..  170 మంది సిబ్బందితో కలిసి.. అచ్చం తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. జనవరి 18, 26 తేదీల్లో ఫిబ్రవరి 3, 12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.   

6 /6

మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కూడా టీటీడీ చైర్మన్ కోరారు. మరోవైపు ఇప్పటికే కుంభమేళకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తొంది. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే భక్తులకు, నాగసాధులకు ఇబ్బందులు కల్గకుండా  అనేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.