కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు శాఖ, వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వైష్ణో దేవి ఆలయానికి సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన జమ్మూకాశ్మీర్ రేసాయ్ జిల్లాలోని కత్రా వైష్టోదేవి ఆలయంలో 400 మంది భక్తులు పూజలు నిర్వహించారని, లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారని కథనాలు పోస్ట్ చేస్తున్నారు. ఏప్రిల్లో బ్యాంక్ సెలవులు ఇవే..
దీనిపై కేంద్ర సమాచార, ప్రసారాశాఖకు చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. వైష్టోదేవి ఆలయంలో ఒకేసారి 400 మంది భక్తులు వెళ్లారన్నది వాస్తవం కాదని, ప్రచారం అవుతున్న విషయంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్ ద్వారా అసలు విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి మార్చి 18వ తేదీన యాత్రను రద్దు చేశారని, అంటే లాక్డౌన్కు వారం రోజులముందే అని తెలిపారు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
Social media messages claiming that 400 devotees are stranded at the #VaishnoDevi or Katra is false. #PIBFactcheck: It is clarified that Yatra stopped on 18th March, much before the lockdown:
CEO of the shrine board has already clarified the same to the media pic.twitter.com/9zxNXS2dXO
— PIB Fact Check (@PIBFactCheck) April 1, 2020
జన సమూహం కారణంగా కరోనా మహమ్మారి సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ప్రకటించిన నేపథ్యంలో లాక్డౌన్కు వారం రోజుల మందు వైష్టోదేవి యాత్రను రద్దు చేశారు. యాత్రికులు సైతం వైష్టోదేవి ఆలయానికి వెళ్లడం ఆగిపోయింది. కానీ కరోనా నేపథ్యంలో కొందరు నెటిజన్లు మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని పోలీసు శాఖ హెచ్చరించింది. దుష్ప్రచారం చేసినట్లు గుర్తిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసుశాఖ స్పష్టం చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ