అది రాజ్యాంగ విరుద్ధం.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిని నివారించేందుకు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ అమలు ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 

Last Updated : May 12, 2020, 05:28 PM IST
అది రాజ్యాంగ విరుద్ధం.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు...

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిని నివారించేందుకు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ అమలు ప్రస్తుతం మూడో విడత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన లాక్‌డౌన్ రాజ్యాంగ విరుద్ధమని, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడానికి వీల్లేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్ధం కావడం లేదన్నారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఔరంగాబాద్ జిల్లాలో 16 మంది వలస కార్మికులు మృతిచెందడం దురదృష్టకరమన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News