భారత క్రికెట్కు విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే చూడాలనుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈ నెలలో ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటంతో తర్వాత అధ్యక్షుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
భారత్కు చెందిన వ్యక్తి ఐసీసీ అధ్యక్షుడైతే తనకు ఏ అభ్యంతరం లేదని సఫారీల సీఈఓ జాక్ ఫాల్ కామెంట్లపై స్పదించిన దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ స్మిత్.. ‘దాదా’ గంగూలీ వైపు మొగ్గుచూపాడు. గంగూలీ లాంటి వ్యక్తి ఐసీసీ అధ్యక్ష పదవికి అర్హుడని గురువారం మీడియాతో మాట్లాడుతూ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘గంగూలీ ఐసీసీ అధ్యక్షుడు కావడం క్రికెట్కు మేలు చేస్తుంది. మోడ్రన్ క్రికెట్ గురించి అతడికి పూర్తిగా అవగాహన ఉంది. అతడు క్రికెట్కు విశేష సేవలందించాడు. తొలిసారి రూ.49 వేల మార్క్ చేరిన బంగారం
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గొప్ప నాయకత్వం ఆటకు ఎప్పుడూ మేలు చేస్తుంది. గంగూలీతో చాలా ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాను. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీ కాలం జూన్ నెలలో ముగియనుంది. భారత్కు చెందిన వ్యక్తి మరోసారి ఐసీసీ అత్యున్నత పదవి చేపడితే సంతోషిస్తాం. గంగూలీ ఆ పదవికి అన్ని విధాలా అర్హుడని’ దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ తన మనసులో మాటను బహిర్గతం చేశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్