కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్(Saryendar Jain) వేగంగా కోలుకుంటున్నారు. గత నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ(Plasma Therapy) తీసుకున్న తర్వాతే సత్యేందర్ జైన్ వేగంగా కోలుకుంటుండటం విశేషం. Photos: ఆకాశంలో అద్భుతం.. సూర్యగ్రహణం ఎక్కడ.. ఎలా, ఫొటో గ్యాలరీ
కాగా, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో ఢిల్లోనీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఆరోగ్య మంత్రికి పాజిటివ్‌గా నిర్ధారించారు. శ్వాస సమస్య అలాగే ఉండటంతో పాటు శుక్రవారం సత్యేందర్ జైన్ పరిస్థితి కాస్త విషమించడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్లాస్మా థెరపీ చికిత్స అందించగా ఆయన వేగంగా కోలుకున్నారు. దీంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి రేపు(సోమవారం) మార్చనున్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
కరోనాకు సత్యేందర్ జైన్ చికిత్స తీసుకుంటుండగా ఆయన ఆరోగ్యశాఖ బాధ్యతలను తాత్కాలికంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పగించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..