Abhishek Bachchan: అమీర్‌తో నటించను కానీ.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Abhishek Bachchan Instagram: 2013లో అమీర్‌ఖాన్ (Aamir Khan), అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan) ఇద్దరు కలిసి యాక్షన్ ఎంటర్‌టైనర్ ధూమ్ 3 (Dhoom 3) మూవీలో అద్భుతంగా నటించారు. ఆ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ అభిమానులను కట్టిపడేస్తుంటాయి. ఈ క్రమంలో అభిషేక్ ధూమ్3లో అమీర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.

Last Updated : Jun 27, 2020, 12:03 PM IST
Abhishek Bachchan: అమీర్‌తో నటించను కానీ.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Abhishek Bachchan Instagram: 2013లో అమీర్‌ఖాన్ (Aamir Khan), అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan) ఇద్దరు కలిసి యాక్షన్ ఎంటర్‌టైనర్ ధూమ్ 3 (Dhoom 3) మూవీలో అద్భుతంగా నటించారు. ఆ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ అభిమానులను కట్టిపడేస్తుంటాయి. ఈ క్రమంలో అభిషేక్ ధూమ్3లో అమీర్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే కాలంలో తాను అమీర్‌తో నటించాలనుకోవడంలేదని, ఆయన దర్శకత్వం చేస్తే ఆ చిత్రంలో నటించాలని ఉందని అభిషేక్ పేర్కొన్నాడు. ఈ మేరకు అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు..  ‘‘ ధూమ్.. నాకు అమీర్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇచ్చింది. నాకు మరోసారి అవకాశం వస్తే.. ఆయనతో కలిసి నటించడం కంటే.. ఆయన దర్శకత్వంలో నటించడమంటేనే నాకు చాలా ఇష్టం.. అమీర్ మీరు దీన్ని చదివితే దయచేసి నా ఈ అభ్యర్థనను అంగీకరించండి’’ అంటూ పోస్ట్ చేశాడు. Baahubali in masks: మాస్కుల్లో బాహుబలి, భల్లాలదేవ వీడియో )

దీంతోపాటు అమీర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. ‘‘అమీర్ సహనటుడిగా మంచిగా కలిసిమెలసి ఉంటారు. స్నేహభావంతో సహాయమందిస్తారు. ఆయన దర్శకుడిగా ఎంత బాగుంటారో నేను ఆలోచించగలను. ఆయనలో గొప్ప ప్రతిభావంతుడు ఉన్నాడు. సెట్‌లో ఏ సన్నివేశంలో పనిచేసినా.. ఆయన నవ్వుతూనే కనిపిస్తారు’’ అని రాశాడు. 

2013లో విడుదలైన ధూమ్ 3 చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య (Vijay Krishna Acharya) దర్శకత్వం వహించగా.. ఇందులో  కత్రినా కైఫ్ (Katrina Kaif), ఉదయ్ చోప్రా (Uday Chopra) కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News