ఆలయాన వెలసిన ఆ దేవును రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే పాట మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఈ పాటలోనే సాహిత్యాన్ని తన జీవిత అంశంగా మార్చుకున్నాడు కర్ణటకకు చెందిన ఒక వ్యాపార వేత్త.
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకుచెందిన వ్యాపార వేత్త శ్రీనివాస్ గుప్తా తన కొత్త ఇంటి హౌజ్ వార్మింగ్ ను వేడుకగా నిర్వహించాడు. ఆ సమయంలో ఒక మహిళ ఇంట్లో మహారాణిలా కొలువై ఉంది.
అందమైన గులాబీ రంగు చీరలో, తళుక్కులీనే బంగారు ఆభరణాలతో ముత్తైదువులా కనిపిస్తోన్న ఆ మహిళ ఆ కార్యక్రమం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది.
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకుచెందిన వ్యాపార వేత్త శ్రీనివాస్ గుప్తా తన కొత్త ఇంటి హౌజ్ వార్మింగ్ ను వేడుకగా నిర్వహించాడు. ఆ సమయంలో ఒక మహిళ ఇంట్లో మహారాణిలా కొలువై ఉంది.
ఆమె శ్రీనివాస్ గుప్తా సతీమణి. కానీ ఆమె ఇప్పుడు సజీవంగా లేదు. మీరు చూస్తోంది కూడా ఆమె పరిపూర్ణమైన మైనపు విగ్రహం.
2017లో తిరుపతి నుంచి తిరిగివస్తున్న సమయంలో శ్రీనివాస్ గుప్తా భార్య మాధవి రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన భార్య లేని లోటు తీరలేనిది అని .. ఇలా తను తన కుటుంబంతో ఉండేలా ఒక శిల్పిని కలిసి ఇలా మైనపు విగ్రహం తయారు చేయించాడు.