పోలీస్ దుస్తులపై కృష్ణుడి బొమ్మ: యూపీ సర్కార్ నిర్ణయం

యూపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర పుణ్యక్షేత్రమైన మధుర ప్రాంతంలోని పోలీసుల యూనిఫారంలో కృష్ణుడి బొమ్మను లోగోగా చేర్చాలని నిర్ణయం తీసుకుంది.

Last Updated : Dec 15, 2017, 04:51 PM IST
పోలీస్ దుస్తులపై కృష్ణుడి బొమ్మ: యూపీ సర్కార్ నిర్ణయం

యూపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర పుణ్యక్షేత్రమైన మధుర ప్రాంతంలోని పోలీసుల యూనిఫారంలో కృష్ణుడి బొమ్మను లోగోగా చేర్చాలని నిర్ణయం తీసుకుంది. కుల, మతాలకతీతంగా ఆ ప్రాంత పోలీసులందరూ ఈ లోగో ఉన్న యూనిఫారం ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే 'యూపీ పోలీస్' అనే బదులు ఆయా ప్రాంత పోలీసులకు 'టూరిజం పోలీస్' అనే పదాలు యూనిఫారంలో ఉండేలా చూడాలని టూరిజం శాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీస్ యూనిఫారం లోగోలో కృష్ణుడి బొమ్మను చేర్చడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. 

పోలీసు యూనిఫారంలో కృష్ణుడి లోగో ఉండేలా సర్కార్ ఆదేశాలు జారీ చేస్తే.. ఇక భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఎలా చూడగలుగుతామని.. ఒక మతం పట్లే పక్షపాత వైఖరి గల సర్కార్‌ అని ప్రభుత్వాన్ని జనాలు విమర్శిస్తారని ఇప్పటికే మాజీ డీజీపీ బ్రిజ్ లాల్ అభిప్రాయపడ్డారు. అయితే యూపీలోని మధుర ప్రాంత పోలీసులు టూరిస్టు ఫ్రెండ్లీ పోలీసులని అని చాటిచెప్పేందుకే తాము పోలీసు లోగోలో కృష్ణుడి బొమ్మని ప్రభుత్వం చేర్చిందని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు.

 

Trending News