అతి ఎక్కడైనా ప్రమాదమన్నారు గానీ..ప్రేమ, అభిమానంలో మాత్రం చెప్పలేదు. కానీ ప్రేమలో కూడా అతి ప్రమాదమేనని నిరూపిస్తోంది ఈ ఘటన. ఇంత ప్రేమను భరించలేకపోతున్నా...విడాకులిప్పించమంటోంది ( Woman seeking divorce ) సదరు మహిళ.
మీరు మీ భార్యను అమితంగా...సారీ..అతిగా ప్రేమిస్తున్నారా..వద్దు ప్లీజ్.. తగ్గించండి, లేకపోతే విడాకులు ( Divorce ) కోరే ప్రమాదముంది. ఆశ్యర్యంగా ఉందా...నిజమే అదే జరిగింది. ఉత్తరప్రదేశ్ ( up ) సంభల్ ( Sambhal ) జిల్లాలో. యూపీలోని ఓ గృహిణికి 18 నెలల క్రితం నికాహ్ జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఏ గొడవలూ లేవు. అయినా సరే విడాకులు కావాలని షరియా కోర్టును ( Shariah court ) ఆశ్రయించింది. ఆమె చెప్పిన కారణం విని మత పెద్దలు నిర్ఘాంతపోయారు.
ఏడాదిన్నరగా ఒక్కసారంటే ఒక్కసారి కూడా తనతో గొడవ పడని భర్తతో కాపురం చేయలేనంటోంది. ఆమె చెప్పిన కారణాలివీ.." నా భర్త నాపై ఒక్కసారి కూడా అరవలేదు. ప్రతి విషయంలో నాకే వత్తాసు పలుకుతాడు. తప్పు చేసినా క్షమిస్తాడు. ఒక్కసారి కూడా కోపగించుకోడు. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి. సరదాకైనా తనతో గొడవ పడాలని ఉంటుంది. ఏదో విషయంలో గొడవ పెడుతుంటాను. అయినా తనే వెనక్కి తగ్గుతాడు. ఇంటి పనుల్లో సహాయం చేస్తాడు. ఆయన ప్రేమ నాకు ఊపిరి సలపకుండా చేస్తోంది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను"…
ఇది విని ఆశ్చర్యపోయిన మత పెద్దలు విడిపోవడానికి ఈ కారణాలు సరిపోవని మరే ఇబ్బందులు ఉన్నా చెప్పమని కోరారు. అలాంటివేవీ లేవని చెప్పిందామె. దాంతో మత పెద్దలు చేతులెత్తేయడంతో విషయం కాస్తా స్థానిక పంచాయితీకు చేరింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పర్ఫెక్ట్ భర్తగా ( perfect husband ) ఉండటం కూడా తప్పనే అని ఆ భర్త మొరపెట్టుకోవడంతో ...పంచాయితీ పెద్దలు కుటుంబ సభ్యుల మధ్యనే పరిష్కరించుకోవాలని సూచించారు. Also read: Covid19 pass: ఇకపై రాష్ట్రాల్లో ఎంట్రీ పాస్ లు వద్దు..కేంద్రం ప్రకటన
ఇదీ జరిగిన ఘటన. అతిగా ప్రేమించాలని అనుకుంటాం కానీ..అది కూడా ప్రమాదకరమే మరి. ఈ వ్యవహారం గురించి ఆనోటా ఈనోటా విన్నవారు మాత్రం...అందుకే చిన్న చిన్న తగాదాలు, సంతోషాలు, అలకలు ఉంటేనే మంచిదని అంటున్నారు. మరి దీనికి సమాధానం మాత్రం మీరే చెప్పాలి.
అచ్చం ఇటువంటిదే ఘటన గత ఏడాది యూఏఈ ( UAE ) లోని ఫుజైరా ( Fuzairah )లో చోటుచేసుకుంది. అక్కడ కూడా ఓ భార్య తన భర్త అతి ప్రేమను భరించలేకపోతున్నానని ..విడాకులు కావాలని కోరుకుంది. Also read: Russia’s Second Vaccine: అద్భుత ఫలితాలు చూపిస్తున్న రెండో వ్యాక్సిన్
Too much love: ప్రేమ భరించలేకపోతున్నా...విడాకులివ్వండి