మెట్రో రైలు విశ్వనగరం హైదరాబాద్‌కు గర్వకారణంగా భావించాం. కానీ పరిస్థితి ఏడాదికే తారుమారైంది. పలు మెట్రో స్టేషన్లలో పగుళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే మూసాపేట మెట్రో స్టేషన్లో గోడలకు పగుళ్లు (Cracks to Moosapet Metro Station) అధికంగా కనిపిస్తున్నాయి. మెట్రో రైలు (Hyderabad Metro) ప్రయాణం సురక్షితమేనా.. హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద నిల్చోవడం మాత్రం చాలా ప్రమాదమని హైదరాబాద్ నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. Telangana: 1000 దాటిన కరోనా మరణాలు
మూసాపేట మెట్రో స్టేషన్ పగుళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మూసాపేట మెట్రో గోడల పగుళ్లను సిమెంట్‌తో పూడ్చేశారు. కానీ అసలు సమస్య అది కాదు. కరోనా వ్యాప్తితో కొన్ని నెలలు బంద్ అయిన మెట్రో సేవలు సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా హైదరాబాద్‌లోనూ ప్రారంభమయ్యాయి. COVID-19 Vaccine: అమెరికా ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త
ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండటంతో వాహనదారులతో పాటు పాదచారులు సైతం మెట్రో స్టేషన్ కిందకి పరుగెత్తి తలదాచుకోవడం అలవాటే. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిల్చోవడంతో ప్రాణాలు కోల్పోయిన మహిళ ఘటన గుర్తుచేసుకుంటున్నారు. స్టేషన్ కింద నిల్చున్న మహిళ తల మీద మెట్రో స్టేషన్ గోడ పెచ్చులూడి పడిపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆ మహిళ చనిపోవడం తెలిసిందే. Hyderabad Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌లో పలు మెట్రో స్టేషన్లలో పగుళ్లు కనిస్తున్నాయని, మెట్రో గోడల నాణ్యతను త్వరగా పరిశీలించి వాటిని సరిచేయాలని అధికారులను నగరవాసులు కోరుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో చినుకు పడిందంటే రోడ్ల మీద ఉన్న ద్విచక్రవాహనదారులు, పాదచారులు మెట్రో స్టేషన్ల కిందకే తలదాచుకునేందుకు పరుగులు తీస్తున్నారు. విశ్వనగరం మెట్రో నగరవాసులకు సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్?
ఫొటో గ్యాలరీలు
-
బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR