తెలంగాణ (Telangana) సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ (Bathukamma). తెలంగాణలో బతుకమ్మ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు (అక్టోబర్ 24 వరకు) బతుకమ్మ పండుగ జరుగుతుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ (Engili pula Bathukamma)తో దసరాకు ముందే పండుగ ప్రారంభం అవుతుంది. మహిళలు, యువతులు.. ఎంతో ఇష్టంగా పూల పండుగ బతుకమ్మ (Bathukamma is floral festival) వేడుకలలో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ సమస్య, వివాదాలు లేకుండా రాష్ట్ర పండుగగా బతుకమ్మకు గుర్తింపు ఇచ్చింది ప్రభుత్వం. అందువల్ల బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కారణంగా మహిళలు జాగ్రత్తగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సూచించారు. కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ సంబంరాలు ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
ఎంగిలిపూల బతుకమ్మ.. ఆ పేరు ఎందుకంటే..
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొలిరోజు బతుకమ్మను పేర్చడానికి వాడే పూలను ఒకరోజు ముందే తీసుకొస్తారు. పువ్వులు వాడిపోకుండా నీళ్లలో వేసి మరుసటిరోజు ‘బతుకమ్మ’గా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe