నువ్వా నేనా సమరం మొదలైంది. బరిలో మిగిలేది ఎవరో తెల్చుకునే సమరం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ ( Sunrisers Hyderabad ) ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడేళ్ల తరువాత నాకౌట్ కు చేరుకున్న బెంగుళూరు విజేతగా నిలుస్తుందా లేదా మరి..
నువ్వా నేనా మ్యాచ్ లో ...టైటిల్ సాధించాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ( Royal Challengers Bengaluru ) కష్టాల్లో పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు ప్రారంభంలోనే తొలి వికెట్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat kohli ) ను కోల్పోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో రెండు జట్లకు ఇది కీలకం. అటువంటి కీలకమైన మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ ముందే అవుటవడంతో జట్టు పూర్తిగా నిరాశకు గురైంది. ఈ సీజన్ లో తొలిసారి రెండో స్థానం నుంచి మారి..ఓపెనర్ గా బరిలో దిగాడు. కెప్టెన్ గా తీసుకున్న ఈ నిర్ణయమే అతన్ని ఔట్ చేసినట్టుంది. 7 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ కు చేరిపోయాడు. హోల్డర్ బౌలింగ్ లో గోస్వామి క్యాచ్ తీసుకోగా విరాట్ వెను తిరిగాడు. ప్రారంభంలోనే ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. తరువాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 13 ఓవర్లు ముగిసేసరికి...నాలుగు వికెట్లు కోల్పోయింది.
RCB 76/4 (12.5)
RCB 99/5 (15.4)
RCB 131/7 (20)
20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి..131 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు.