Dubbaka Bypoll twist: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల కమీషన్ ట్విస్ట్

దుబ్బాక  ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో...ఎన్నికల కమీషన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇంకా లెక్కింపు మిగిలుందని..పూర్తి కాలేదని తెలంగాణ ఎన్నికల కమీషనర్ శశాంక్ గోయల్ ప్రకటించారు.

Last Updated : Nov 10, 2020, 05:56 PM IST
Dubbaka Bypoll twist: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో ఎన్నికల కమీషన్ ట్విస్ట్

దుబ్బాక  ఉప ఎన్నిక ( Dubbak Bypoll ) ల్లో విజయం సాధించిన బీజేపీ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో...ఎన్నికల కమీషన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇంకా లెక్కింపు మిగిలుందని..పూర్తి కాలేదని తెలంగాణ ఎన్నికల కమీషనర్ శశాంక్ గోయల్ ప్రకటించారు.

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగాయి. తుది వరకు ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో చివరికి బీజేపీ అభ్యర్ది రఘునందర్ రావు విజయం సాధించారు. 1118 ఓట్ల తేడాతో గెలుపొందారు. విజయం సాధించడంతో బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ ఎన్నికల కమీషన్ నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇంకా లెక్కింపు పూర్తి కాలేదని...మిగిలుందని చెప్పడమే దీనికి కారణం.

దుబ్బాక ఓట్ల లెక్కింపు ( Dubbaka Counting ) లో నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలున్న నాలుగు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లలో 1669 ఓట్లు ఉన్నాయని చెప్పేపారు. రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఫలితం ఇంకా రాలేదని, రెండు కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించనున్నట్లు చెప్పారు. 136, 157/ఏ పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ తర్వాత.. ఓట్లను క్లియర్‌ చేయలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరించారు. Also read; Dubbaka Final Result: దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం

Trending News